రెండేళ్ల క‌ష్టం త‌ర్వాత ఫ్యామిలీ కోస‌మే చ‌ర‌ణ్ టైమ్

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో పెద్ది ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Update: 2026-06-07 13:28 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో పెద్ది ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు తెరపై చూసింది ఒక పాత్ర మాత్రమే అయినా, ఆ పాత్ర వెనుక దాదాపు రెండేళ్ల పాటు సాగిన కఠినమైన శారీరక, మానసిక ప్రయాణం ఉందనే విష‌యం తెలిసిందే. అథ్లెట్ తరహా మేకోవ‌ర్ ను సాధించడానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకోవడం, భారీ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు వెళ్లడం, షూటింగ్ సమయంలో పలుమార్లు గాయాల బారిన పడటం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ చరణ్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. సినిమా రిలీజైన తర్వాత ఆయన యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ఆడియ‌న్స్ నుంచి యునానిమ‌స్ ప్రశంసలు రావడంతో ఆ కష్టం ఫలించింన‌ట్టైంది.

అయితే పెద్ది షూటింగ్ టైమ్ మొత్తం చరణ్‌పై తీవ్రమైన శారీరక ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌కు సంబంధించిన ఎపిసోడ్లు, ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్‌నెస్ రొటీన్ కారణంగా ఆయన శరీరంపై భారీ భారం పడిందని టాక్. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయ్యాక కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పెద్ది త‌ర్వాత తదుపరి ప్రాజెక్ట్‌గా డైరెక్ట‌ర్ సుకుమార్ తో చేయనున్న సినిమా మొద‌ల‌వ‌డం ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ ఆయనకు అనుకోని అవకాశంగా మారింది. దాదాపు మూడు నెలల పాటు ఎలాంటి కొత్త షూటింగ్‌లు లేదా షూటింగ్స్ ఒప్పుకోకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోవాల‌నే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. ఇదే సమయంలో షూటింగ్ టైమ్ లో వచ్చిన సమస్యల నేపథ్యంలో చేతికి చిన్న స‌ర్జ‌రీ కూడా చేయించుకునే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ బ్రేక్ ను కేవలం ఆరోగ్య పరిరక్షణ కోసమే కాకుండా ఫ్యామిలీతో గడిపేందుకు కూడా ఉపయోగించుకోవాలని చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ది కోసం సాగిన సుదీర్ఘ షూటింగ్ కారణంగా ఫ్యామిలీకి తగినంత సమయం కేటాయించలేకపోయాననే భావన ఆయనలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఈ మూడు నెలలను పూర్తిగా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తన పిల్ల‌ల‌తో గ‌డ‌పాల‌ని చ‌ర‌ణ్ నిర్ణయించుకున్నారట. మరోవైపు పెద్ది కోసం పెంచుకున్న అథ్లెట్ లుక్‌ను కూడా ఈ సమయంలో క్రమంగా తగ్గించుకుని, తదుపరి ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా కొత్త మేకోవర్‌కు రెడీ అయ్యే అవకాశ‌ముంది. పెద్ది స‌క్సెస్‌తో వచ్చిన ఆనందం ఒకవైపు ఉంటే, ఆ సినిమా కోసం చేసిన త్యాగాల నుంచి కోలుకోవాల్సిన అవసరం మరోవైపు కనిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు మ‌రో చ‌ర్చ మొద‌లైంది. ప్రస్తుతం స్టార్ హీరోలపై ఫిజికల్ ప్రెషర్ బాగా పెరుగుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్న కొద్దీ హీరోలు కూడా తమ పాత్రల కోసం భారీ స్థాయిలో మేకోవ‌ర్ అవ‌డం, రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం, నెలల తరబడి కఠినమైన ఫిట్‌నెస్ షెడ్యూల్స్ పాటించడం సాధారణంగా మారిపోయింది. అయితే ఈ ప్రక్రియలో గాయాలు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితానికి దూరమవడం వంటి పరిణామాలు కూడా పెరుగుతున్నాయి.

Tags:    

Similar News