చరణ్ - నీల్.. నిజమెంత?

రామ్ చరణ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే బుచ్చిబాబు సానాతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా “పెద్ది” షూటింగ్ ఈ ఏడాది చివర్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు.;

Update: 2025-07-16 07:25 GMT

రామ్ చరణ్ ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్‌ను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే బుచ్చిబాబు సానాతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా “పెద్ది” షూటింగ్ ఈ ఏడాది చివర్లో పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వీలైనంత త్వరగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలనుకుంటున్నాడు. అయితే అదే సమయంలో సుకుమార్‌తో మరో భారీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పెద్ది సినిమా తర్వాత ఒక ప్రాజెక్ట్ పూర్తిచేసి ఆ తర్వాతే సుకుమార్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ తన తదుపరి సినిమా కోసం పలు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్ట్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథను మాత్రమే కాదు, టైమ్‌ లైన్, బిజినెస్ హైప్ అన్నిటినీ బట్టి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఇటీవల మీడియా, వెబ్ పోర్టల్స్ లో చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో రామ్ చరణ్ సినిమా ఖరారైందని, త్వరలోనే ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయాలనే ఉద్దేశం ఉన్నా, ప్రస్తుతానికి అది ఎలాంటి స్థాయిలోనూ ఫిక్స్ కాలేదట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న “డ్రాగన్” సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు.

ఈ సినిమా 2026 జూన్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత సలార్ 2 చిత్రాన్ని ప్రభాస్‌తో, తర్వాత కేజీఎఫ్ 3ని యశ్‌తో చేయాల్సి ఉంది. రెండు సినిమాలూ ముందే ప్రకటించబడిన ప్రాజెక్ట్స్ కావడంతో ప్రశాంత్ ప్రస్తుతం కొత్త సినిమా అనేవిధంగా ఎలాంటి చర్చలు చేపట్టడం లేదు. ప్రభాస్ లేదా యశ్ ఎవరు ముందుగా డేట్స్ ఇస్తారో దాన్ని బట్టి తర్వాతి ప్రాజెక్ట్‌కి లైన్ క్లియర్ అవుతుంది.

దాంతో ప్రశాంత్ నీల్ రామ్ చరణ్‌కి కథ చెప్పినట్టు, లేదా చర్చలు ముందడుగు వేశాయన్న వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలే. నిజానికి చరణ్ ఇప్పటికీ తన తదుపరి సినిమాకి కచ్చితమైన దర్శకుడిని ఫైనల్ చేయలేదు. బిజినెస్ పరంగా, కథ పరంగా పర్ఫెక్ట్ ఐడియా వచ్చే వరకు వేచిచూస్తున్నాడు. మొత్తంగా చూస్తే, రామ్ చరణ్ - ప్రశాంత్ నీల్ కాంబో గురించి వస్తున్న వార్తలు అభిమానుల ఆశను కలిగించినా, ప్రస్తుతానికి వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. మరి రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంటే ముందు ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News