రామ్ చరణ్ ట్వీట్‌పై డిస్క‌ష‌న్..ఆల్ఫాను పట్టించుకోకుండా మ‌రో సినిమాపై ప్రశంసలు!

సినీ సెల‌బ్రిటీలు ఏదైనా సినిమాను ప్రశంసించడం కొత్త విషయం కాదు. అయితే ఎలాంటి సినిమాను, ఎప్పుడు, ఏ సందర్భంలో మెచ్చుకుంటారనేదే చాలాసార్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది.

Update: 2026-07-08 05:25 GMT

సినీ సెల‌బ్రిటీలు ఏదైనా సినిమాను ప్రశంసించడం కొత్త విషయం కాదు. అయితే ఎలాంటి సినిమాను, ఎప్పుడు, ఏ సందర్భంలో మెచ్చుకుంటారనేదే చాలాసార్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ఒక ట్వీట్ కూడా ఇప్పుడు అలాంటి డిబేట్‌కే కారణమైంది. బాలీవుడ్ లో తాజాగా రిలీజైన క్రైమ్ థ్రిల్లర్ బేబీ దో డై దో సినిమాను ఆయ‌న చేసిన ప్రశంసలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద బ్యానర్ల సినిమాలు లేదా తమకు సన్నిహితంగా ఉన్న నటీనటుల ప్రాజెక్ట్‌ల గురించి ఎక్కువ‌గా రియాక్ట్ అయి మాట్లాడుతుండ‌టం స‌హ‌జం. అలాంటి సమయంలో భారీ ప్ర‌మోష‌న్స్ తో వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమాల కంటే తక్కువ హైప్‌తో వచ్చిన ఓ కంటెంట్ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌ను చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఆయన ఈ సినిమాను ఎందుకు మెచ్చుకున్నారనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

చ‌ర‌ణ్ ట్వీట్ తర్వాత బేబీ దో డై దో గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఆడియ‌న్స్ లో పెరిగినట్లు కనిపిస్తోంది. సినిమా కథ, నటీనటులు, జానర్, ఆడియ‌న్స్ రెస్పాన్స్ వంటి వివరాల కోసం పలువురు సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమాను చూసినవారు తమ అభిప్రాయాలను పంచుకుంటుండగా, ఇంకా చూడని వారు చరణ్ అంతగా మెచ్చుకునేంత స్పెష‌ల్ ఇందులో ఏముంద‌నే కోణంలో చర్చిస్తున్నారు. మరోవైపు, ఈ పరిణామాన్ని కొందరు అభిమానులు చరణ్ సినిమా సెలెక్ష‌న్‌ల‌ అభిరుచితో ముడిపెడుతున్నారు. కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాల‌ను ఆయన ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుంటారని గుర్తు చేస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్ జానర్‌లో కొత్త ప్రయత్నాలు చేసే సినిమాలకు స్టార్ హీరోల నుంచి లభించే ఇలాంటి ఎంక‌రేజ్‌మెంట్ ఆయా సినిమాల‌కు అదనపు గుర్తింపును తీసుకొస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే సోషల్ మీడియాలో మరో డిస్క‌ష‌న్ కూడా సాగుతోంది. ఆర్ఆర్ఆర్ లో తనతో కలిసి నటించిన అలియా భట్ నటించిన తాజా సినిమా ఆల్ఫాపై చరణ్ ఓపెన్ గా రియాక్ట్ అవ‌కుండా, అదే సమయంలో బేబీ దో డై దో ను ప్రశంసించడం వెనుక ఏదైనా స్పెష‌ల్ రీజ‌న్ ఉందా? అనే ప్రశ్నలు కొందరు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అఫీషియ‌ల్ క్లారిటీ లేకపోవడంతో ఇవన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్క‌ష‌న్స్ గానే చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా, ఒక స్టార్ హీరో చేసిన ఒక్క ట్వీట్‌తో పెద్దగా ప్రచారం లేని సినిమా ఒక్కసారిగా డిస్క‌ష‌న్స్ లోకి రావడం మాత్రం ఆసక్తికర పరిణామంగా మారింది. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రముఖ నటుల మద్దతు లభిస్తే ప్రేక్షకుల దృష్టి మరింత వేగంగా వాటిపై పడుతుందనే విషయాన్ని ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.

Tags:    

Similar News