నార్త్ USలో 'పెద్ది'.. ఈజీగా ఆ క్లబ్ లోకి అడుగుపెడుతుందా?
ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే, విడుదలకు ముందే మరో ఓ మైల్ స్టోన్ ను అందుకునే అవకాశం కనిపిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న గ్రాండ్ గా విడుదల కానున్న ఆ చిత్రం నార్త్ అమెరికా ప్రీమియర్ బుకింగ్స్ లో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ స్పీడ్ చూస్తుంటే, విడుదలకు ముందే మరో ఓ మైల్ స్టోన్ ను అందుకునే అవకాశం కనిపిస్తోంది.
తాజాగా మూవీ టీమ్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. నార్త్ అమెరికా ప్రీమియర్ షోల ద్వారా పెద్ది ఇప్పటికే 8 లక్షల డాలర్ల మార్కును దాటింది. ఆ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్ తో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రీమియర్ షోలు స్టార్ట్ కావడానికి ఇంకా సమయం ఉండటంతో, 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి పెద్ది సినిమా చాలా ఈజీగా అడుగు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే స్టార్ హీరోల చిత్రాల్లో కూడా విడుదలకు ముందే ఆ రేంజ్ లో బుకింగ్స్ నమోదు కావడం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా రంగస్థలం తర్వాత మళ్లీ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో, ఊరమాస్ లుక్ లో రామ్ చరణ్ కనిపిస్తుండటం అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది. అదే బుకింగ్స్ రూపంలో కనిపిస్తుందని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.
విజయనగరం బ్యాక్ డ్రాప్ లో 1980ల కాలం నాటి గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఆ చిత్రం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్పోర్ట్స్ ద్వారా తన గ్రామానికి గుర్తింపు తీసుకు రావాలని కలలు కనే యువకుడి ప్రయాణాన్ని ఎమోషన్స్ తో దర్శకుడు బుచ్చిబాబు చూపించనున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎలిమెంట్స్ కు తోడు స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్ కూడా చిత్రానికి మెయిన్ అసెట్స్ గా నిలవనున్నాయని మూవీ యూనిట్ చెబుతోంది.
ఇక సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరోవైపు శ్రుతి హాసన్ స్పెషల్ సాంగ్ తో పాటు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ పరంగా కూడా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే మంచి రెస్పాన్స్ పొందాయి.
ఏదేమైనా ఇప్పుడు పెద్ది విడుదలకు ముందే నార్త్ అమెరికా మార్కెట్ లో స్ట్రాంగ్ హైప్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ స్పీడ్ బట్టి చూస్తే, ప్రీమియర్లకు ముందే 1 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి అడుగుపెట్టడం పెద్ద విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే స్పీడ్ విడుదల తర్వాత కూడా కొనసాగితే, రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా పెద్ది మూవీ నిలవడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.