వారెవ్వా.. చరణ్ మాములుగా లేడుగా!
రీసెంట్ గా నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు.;
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ఇప్పుడు పెద్ది మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మేకర్స్ ఫుల్ జోష్ లో షెడ్యూల్స్ ను కంప్లీట్ చేస్తున్నారని చెప్పాలి.
రీసెంట్ గా నైట్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసినట్లు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపారు. సెట్స్ లో చరణ్ నిప్పులు చెరుగుతున్నారని చెబుతూ అంచనాలు పెంచారు. అంతకుముందు భారీ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు మేకర్స్. హైదరాబాద్ లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్ లో తీసిన ఆ సన్నివేశాల్లో చరణ్ జీవించేశారని అంతా అన్నారు.
అలా పెద్ది సినిమాకు గాను రామ్ చరణ్ పూర్తిగా లీనమై, పాత్రకు ప్రాణం పోయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు అది నిజమనేలా.. సోషల్ మీడియా పోస్ట్ క్లియర్ గా చెబుతుంది. తాజాగా వర్కౌట్స్ చేస్తున్న వేరే లెవెల్ ఫోటోను రామ్ చరణ్ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.
పెద్ది మూవీ కోసం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయిందని రాసుకొచ్చారు. అందులో చరణ్ అయితే నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నారు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, కండలు తిరిగిన దేహంతో అదిరిపోయారు. సినిమా కోసం ఆయన ఎంతలా కష్టపడుతున్నారో పిక్ ద్వారా తెలుస్తోంది. దీంతో ఆ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అది బాడీ కాదురా.. బాక్సాఫీస్ అంటూ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా బ్లాస్ట్ అంటున్నారు. కమ్ బ్యాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేయ్ అన్న అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి చరణ్ పిక్ ను వైరల్ చేస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.
అయితే ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అందులో చరణ్ లుక్ కు అంతా ఫిదా అయ్యారు. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. నెవ్వర్ బిఫోర్ అనే విధంగా చరణ్ సందడి చేయనున్నారని డిసైడ్ అయిపోయారు.
ఇక మూవీ విషయానికొస్తే.. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీశ్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ రిలీజ్ అవ్వనుంది.