చరణ్ 'పెద్ది'.. నార్త్ USలో ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్‌ కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.;

Update: 2026-05-10 13:08 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్‌ కు ముందే ఓవర్సీస్ మార్కెట్‌ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఆ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రీ సేల్స్‌ లో సినిమా చూపిస్తున్న ర్యాంపేజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



 


జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఆ చిత్రం.. అమెరికాలో మాత్రం జూన్ 3 నుంచి ప్రీమియర్లతో సందడి చేయనుంది. తెలుగు సహా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్న ఆ మూవీకి నార్త్ అమెరికాలో మంచి డిమాండ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే 100K డాలర్ల మార్క్‌ ను దాటేసిన ఆ సినిమా.. తాజాగా 200K డాలర్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.

200K డాలర్లు ప్లస్ కౌంటింగ్ అంటూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్‌ లో పెద్ది సినిమాను ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేస్తోంది. అదే సమయంలో ఇప్పటికే 5000కు పైగా టిక్కెట్లు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండగానే ఈ రేంజ్ బుకింగ్స్ రావడం విశేషమని సినీ ప్రియులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల్లో పెద్దిపై ఆసక్తి రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.

అయితే సినిమాపై హైప్ పెరగడానికి ప్రధాన కారణాల్లో స్టోరీ లైన్ కూడా ఒకటి. 1980 ఆంధ్రప్రదేశ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఆ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్ చరణ్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, డీ-గ్లామర్ లుక్‌లో ఆయన నటిస్తున్నట్లు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చింది. పహిల్వాన్ తరహా పవర్‌ ఫుల్ క్యారెక్టర్‌లో చరణ్ కనిపిస్తారన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది.

ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రయ్ రయ్ రారా పాటలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇక ట్రైలర్‌ తో మూవీపై హైప్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ క్యాస్టింగ్, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో సినిమాపై అన్ని భాషల్లోనూ మంచి బజ్ ఏర్పడింది. ఇక ఓవర్సీస్‌ లో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. పెద్దికి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. రిలీజ్‌ కు ముందే అమెరికాలో ఈ రేంజ్ హవా చూపిస్తుండటంతో.. చరణ్ కెరీర్‌ లో మరో భారీ హిట్‌ గా పెద్ది నిలిచే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News