రామ్ చరణ్ కోసం స్టార్ హీరో తండ్రే మాస్టర్ గా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ సహా ప్రధాన పాత్ర ధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా భాగం షూటింగ్ అంతా అవసరమైన సెట్లు రూపొందించి వాటిలోనే పూర్తి చేసారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైంది. ఇందులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు. చరణ్ సహా ఇతర ఫైటర్లపై చిత్రీకరిస్తోన్న యాక్షన్ సీన్ ఇది.
ఈ యాక్షన్ సన్నివేశంలో శివ రాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్ షామ్ కౌశల్ ని రంగంలోకి దించారు. అతడి పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నవకాంత్ స్టంట్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇప్పటి వరకూ యాక్షన్ సన్నివేశాలన్నీ అతడి ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ తాజా యాక్షన్ సీన్ మాత్రం ఎంతో స్టైలిష్ గా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో షామా కౌశల్ సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినిమాకే ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్ అది. అందుకోసం బడ్జెట్ కూడా ఎక్కువగా ఖర్చు అయిందని సమాచారం. షామా కౌశల్ బాలీవుడ్ లో పేరున్న స్టంట్ మాస్టర్. ఎన్నో హిందీ సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలకు పని చేసారు. కొన్ని తమిళ సినిమాలకు కూడా పని చేసారు. `పొన్నియన్ సెల్వన్`, `దూమ్ -3`, క్రిష్ లాంటి ప్రాంచైజీలకు ఈయన మాస్టార్.
షామా కౌశల్ హీరో విక్కీ కౌశల్ తండ్రి. డాడ్ కి బాలీవుడ్ లో ఎన్నో పరిచయా లున్నా? విక్కీ కౌశల్ మాత్రం డాడ్ పరిచయాల్ని ఎంట్రీ వరకే వినియోగిం చుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా పరిశ్రమలో ఎదిగాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రత్యేకించి దేశ భక్తి నేపథ్యం గల సినిమాలకు విక్కీ కౌశల్ ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్న నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. ఇతడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.