అదిరిపోయిన పెద్ది లుక్..
అసలు విషయంలోకి వెళ్తే..తాజాగా మెగాస్టార్ ఇంటికి జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.;
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన. వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి తొలి పరిచయంలో.. తొలిసారి దర్శకత్వం వహించి 100 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు బుచ్చి బాబుసన. అలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈయన.. ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా సినిమాలో సన్నివేశాలు సహజంగా కనిపించడం కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ షూటింగ్ చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఒక స్పెషల్ సాంగ్ త్వరలోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం .
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న తన పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అదే రోజు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రామ్ చరణ్ పెద్ది లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అసలు విషయంలోకి వెళ్తే..తాజాగా మెగాస్టార్ ఇంటికి జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లడంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రామ్ చరణ్ లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. పొడవైన జుట్టు, గుబురు గడ్డం, వైట్ కలర్ షర్ట్ , కళ్ళకి స్టైల్ గా అద్దాలు పెట్టుకొని మరింత స్టైలిష్ లుక్ లో కనిపించారు రామ్ చరణ్. అలాగే అక్వేరియం దగ్గర చేపలతో ఆడుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి
ఇకపోతే పెద్ది సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నారో అని అభిమానులు కొంతవరకు ఆసక్తిగా ఎదురు చూడగా.. ఇప్పుడు ఆయన ఫార్మల్ లుక్ లో కనిపించి అభిమానులను మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
రామ్ చరణ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సీక్వెల్ లో నటించబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు సమాచారం. నిజానికి గతంలో రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించింది. అయితే ఈసారి సీక్వెల్ లో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు.. ముఖ్యంగా సమంత అయితేనే ఆ పాత్రకు న్యాయం చేయగలదు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి సుకుమార్ నిర్ణయం ఏ విధంగా ఉందో తెలియాల్సి ఉంది.