పెద్ది అసలు హైలైట్ చెప్పిన చరణ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా పెద్దిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ బ్యాక్‌డ్రాప్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, ఎమోషనల్ స్టోరీలైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, చరణ్ లుక్, మాస్ టోన్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాయి.
డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి స్పెషల్ డ్రైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్, పెద్ది సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన భాగం ఢిల్లీ ఎపిసోడ్ అని చెప్పడం అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఆ ఎపిసోడ్ నుంచే నుంచే సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుందని, అదే అసలు మెయిన్ పాయింట్ అని చరణ్ చెప్పడంతో ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సాధారణంగా స్టార్ హీరోలు సినిమాపై హైప్ పెంచేలా కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. కానీ చరణ్ ఈసారి ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్‌ను మాత్రమే హైలైట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది.
ఇప్పటికే పెద్దిలో ఢిల్లీ ట్రాక్‌కు భారీ స్థాయి ఎమోషనల్ వెయిట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడదే ట్రాక్ తన ఫేవరెట్ అని చరణ్ చెప్పడంతో అది సినిమాకు అసలు టర్నింగ్ పాయింట్ అయి ఉండొచ్చనే అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత కథ పూర్తిగా మారిపోతుందని, ఆ ఎపిసోడ్ హీరో జీవితాన్ని మార్చేస్తుందని ఊహాగానాలు ఆల్రెడీ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే పెద్దిని ఇప్పటివరకు చాలా మంది కేవలం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్న మాస్ సినిమా గానే భావించారు. కానీ చరణ్ కామెంట్స్ తర్వాత ఇది ఒక భారీ ఎమోషనల్ జర్నీ కూడా అవుతుందనే అభిప్రాయం బలపడుతోంది. ఒకవైపు గ్రామీణ నేపథ్యంలో సాగిన కథ అకస్మాత్తుగా ఢిల్లీకి షిఫ్ట్ అవ్వడం కూడా సినిమాకు పాన్ ఇండియా ఫీల్ తీసుకురావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఇప్పటికే మంచి హైప్ ఉన్న ఢిల్లీ ట్రాక్‌పై రామ్ చరణ్ చేసిన తాజా కామెంట్స్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇక చరణ్‌ను అంతగా కదిలించిన ఆ ఎపిసోడ్‌లో ఏముందో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.