చరణ్..తారక్ ఆ సౌండ్ సరిపోదు!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `ఆర్ఆర్ఆర్` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `ఆర్ఆర్ఆర్` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ చిత్రం బాక్సాఫీస్ వందల కోట్ల వసూళ్లను సాధించడంతో ఇద్దరు హీరోల తదుపరి సినిమాలపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఆ పాన్-ఇండియా క్రేజ్‌కు తగినట్లుగా ఆ తర్వాత ఇద్దరి నుంచి రిలీజ్ అయిన చిత్రాలుచెరో 300 కోట్ల వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ నటించిన `దేవర` చిత్రం కొంతమేర మంచి వసూళ్లను రాబట్టగా... రామ్ చరణ్ నటించిన `పెద్ది` కూడా 300 కోట్ల వసూళ్లనే రాబట్టింది.
`ఆర్ఆర్ఆర్` వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఊపును చూస్తే ఈ స్థాయి వసూళ్లు ఆ స్టార్ హీరోల స్థాయికి సరిపోవనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. వందల కోట్లతో సరిపెట్టుకోకుండా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేలా వారి సినిమాల సౌండ్ ఉండాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత పాన్-ఇండియా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం 300 కోట్ల కలెక్షన్లు అనేది కేవలం సాధారణ మైలురాయి మాత్రమే. ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్న అగ్ర హీరోలు కనీసం 600 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న ప్రాజెక్ట్‌లను అందించాలి.
అప్పుడే వారు పాన్-ఇండియా రేసులో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించగలరని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. తదుపరి చిత్రాలతోనైనా రామ్ చరణ్ - తారక్ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త వసూళ్ల సునామీ సృష్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రాంతీయ మార్కెట్‌ను దాటి నార్త్ ఓవర్సీస్ మార్కెట్లలోనూ తిరుగులేని వసూళ్లు సాధించినప్పుడే గ్లోబల్ స్టార్స్ అనే ట్యాగ్‌కు పరిపూర్ణత వస్తుంది. దర్శకుల ఎంపికలోనూ, కథా బలం విషయంలోనూ మరింత దూకుడుగా వ్యవహ రించాల్సిన సమయం ఆసన్నమైంది.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ ఉన్న మాస్ ఫాలోయింగ్, నటనపై ఉండే పట్టును బట్టి చూస్తే 600 కోట్ల మార్కును దాటడం వారికి పెద్ద కష్టమేమీ కాదు. సరైన కథాంశం, పక్కా కమర్షియల్ హంగులతో కూడిన స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం. అభిమానులు కూడా హిట్‌లతో సరిపెట్టుకోకుండా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి `ఆర్ఆర్ఆర్` తర్వాత వచ్చిన సినిమాలతో ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సౌండ్ వినిపించలేదనే విమర్శలకు తదుపరి ప్రాజెక్ట్‌లతో రామ్ చరణ్, తారక్ గట్టి సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఒక్కో హీరో అప్ కమింగ్ చిత్రాలతో కనీసం 600 కోట్ల కలెక్షన్ల క్లబ్‌లో చేరితేనే పాన్-ఇండియా రేసులో అసలైన సంచలనాలు సృష్టిం చినట్లవుతుంది.