• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్ లైనప్ లో మరో యువ...

చరణ్ లైనప్ లో మరో యువ దర్శకుడు?

| రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చివరి దశ షెడ్యూల్ కొనసాగుతోంది.

By - Tupaki Desk
Update: 2025-05-22 02:30 GMT

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం పెద్ది ప్రాజెక్టుతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చివరి దశ షెడ్యూల్ కొనసాగుతోంది. ఇది అయిపోయిన వెంటనే చ‌ర‌ణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దర్శకుడు సుకుమార్‌తో మరో సినిమా చేయాలన్న ప్రణాళికలు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. మ‌రోవైపు త్రివిక్ర‌మ్ - వెంకటేష్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్‌లో కూడా చ‌ర‌ణ్ కీలక పాత్ర పోషించే ఛాన్సు ఉందన్న బజ్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.

అయితే, లేటెస్ట్ సుజిత్ కూడా రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో సుజిత్ రూపొందిస్తున్న ‘ఓజీ’ ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత సుజిత్ తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కోసం ఒక మాస్ యాక్షన్ కథను సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

చరణ్‌తో మాస్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాను తెరకెక్కించాలని సుజిత్ బలంగా కోరుకుంటున్నాడట. ఈ కథకు రామ్ చరణ్ సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. సుజిత్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తయిన వెంటనే నానితో ఓ సినిమా చేయాలనేది అసలు ప్లాన్. కానీ నాని కూడా ‘పారడైజ్‌’ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌కి కాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక అప్పటిలోగా రామ్ చరణ్ తన ప్రాజెక్ట్‌లను ముగిస్తే, DVV ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చరణ్ సుజిత్ కాంబినేషన్‌కి గ్రీన్ సిగ్నల్ రావొచ్చని భావిస్తున్నారు. ఎప్పుడు మొదలైనా ఈ కలయికపై క్రేజ్ మాత్రం భారీగానే ఉంటుంది. చరణ్‌కు యాక్షన్ బేస్డ్ స్క్రిప్టులు బాగా సూటవుతాయి. అతని మాస్ యాంగిల్ ఎంత బలంగా కనబడ్డదో గత సినిమాలతో తెలిసిందే.

అదే దిశగా సుజిత్ ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రెడీ చేయడమే ఈ కాంబోకి ప్లస్ అయ్యే అంశం. పైగా ‘సాహో’ తర్వాత సుజిత్‌కి ఓ హిట్ అవసరం. చరణ్ లాంటి స్టార్‌తో హై వోల్టేజ్ ప్రాజెక్ట్ చేయడం అతనికి తిరుగు లేని కమర్షియల్ సక్సెస్ అందించవచ్చు. కానీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాలంటే కనీసం 2026 మొదటి భాగం వరకూ టైం పడుతుంది. కానీ అప్పటివరకు కథను మెచ్యూర్ చేయడానికి, ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మెల్లగా నడిపించడానికి పూర్తి సమయం ఉంటుంది. మరి నిజంగా ఈ కాంబినేషన్ సెట్టవుతుందో లేదో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    
  • RamCharan 
  • Sujeeth 
  • Tollywood 
  • RamCharanMovies 
  • RC16 
  • RC17Movie 
  • BuchiBabu 
  • Sukumar 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS