రామ్ చరణ్ ఆ సినిమా క్యాసెట్ వేస్తే గానీ తినేవాడు కాదు!
మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.;
మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని రామ్ చరణ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి తనయుడు అన్నది కేవలం ఎంట్రీ వరకే పరిమితం. ఆ తర్వాత చరణ్ ఎదుగుదల అంతా స్వయం కృపారాధమే. పరిశ్రమలో తనని తానే నిర్మించుకున్నాడు. ఇంతింతై వటుడింతైన చందంగా ఎదిగాడు. రీజనల్ స్టార్ నుంచి పాన్ ఇండియా వరకూ ఎదిగాడు. అటుపై గ్లోబల్ స్థాయిలోనూ ఇమేజ్ సంపాదించాడు. నటుడిగా ఎన్నో సినిమాలు. ..వైవిథ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు.
చిన్నప్పుడే సినిమాలపై ఆసక్తి:
అయితే చరణ్ చిన్న నాటి నుంచి సినిమా వాతావరణంలోనే పెరిగాడు. తండ్రి పెద్ద స్టార్ కావడంతో ఇంట్లో అంతా సినిమా వాతావరణమే. కానీ ఆ ప్రభావాన్ని చిరంజీవి తనయుడిపై పడకూడదనుకున్నారు. అందుకే ఇంట్లో చిరంజీవి ఎప్పుడూ స్ట్రిక్ట్ గానే ఉండేవారు. సినిమా షూటింగ్ నుంచి వచ్చినా? ఆ విషయాలు పెద్దగా ఇంట్లో చెప్పే వారు కాదు. పిల్లలకు సినిమాల కంటే ఆ వయసులు చదువు ముఖ్యమని దానిపైనే శ్రద్ద ఉండేలా చర్యలు తీసుకునేవారు. కానీ రామ్ చరణ్ కి మాత్రం చదువు పెద్దగా అబ్బలేదు. కాలేజీకి ఢుమ్మా కొట్టి షికార్లు కొట్టడాలు ఇవన్నీ మద్రాసులో ఉన్నప్పుడే చేసారు.
చరణ్ , బన్నీ ఇద్దరు ఇద్దరే:
రానా క్లోజ్ ప్రెండ్ కావడంతో? అతడితో కలిసి ఎంజాయ్ చేసేవారు. అలా ఎంజాయ్ చేసిన వారే జీవితంలో ఎదుగుతారు అనడానికి చరణ్, బన్నీ ఓ ఉదాహరణ. బన్నీ కూడా అలాగే తిరిగే వారు. ప్రెసిడెంట్ చేతుల మీదుగా జాతీయ అవార్డు తీసుకున్న అనంతరం స్కూల్లో ఎప్పుడూ టీసీలు తీసుకునే తాను ఇలాంటి అవార్డు అందుకుం టానని ఎప్పుడు అనుకోలేదని ఓపెన్ గానే అన్న సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన బెడితే తాజాగా చిరంజీవి తనయుడి గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసారు. చరణ్ చిన్నప్పుడు `కొదమసింహం` క్యాసెట్ పెడితే గానీ అన్నం తినేవాడు కాదుట.
చరణ్ తర్వాత చిరంజీవి మరోసారి:
ఆ సినిమా పెట్టమని మారం చేసేవాడుట. తనకంటే `కొదమ సింహం` చరణ్ కి ఎక్కువగా ఇష్టమని తెలిపారు. అందులో కౌబోయ్ పాత్ర అంటే తనతో పాటు చరణ్ కు ఎంతో ఇష్టమన్నారు. అలాంటి సినిమా చేసే అవకాశం చరణ్ కు కెరీర్ ఆరంభంలోనే వచ్చిన సంగతి తెలిసిందే. రాజులు రాజ్యాల నేపథ్యంలో `మగధీర` చిత్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో చరణ్ గుర్రపు స్వారీ సన్నివేశాలు ఏ రేంజ్ లో పండాయో తెలిసిందే. ఆ సినిమా చూసిన తర్వాత చిరంజీవికి కూడా ఆ తరహా పాత్రపై మళ్లీ మనసు చేసిన చిత్రమే `సైరా నరసింహారెడ్డి`.