రెస్ట్ మోడ్ లోకి స్టార్ హీరోలు.. ఎందుకంటే..

వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు తెరకెక్కుతున్న ఈ రోజుల్లో పక్కా ప్లానింగ్ తో సెట్స్ లోకి వెళ్లడం చాలా అవసరం.

Update: 2026-07-28 16:06 GMT

వందల కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు తెరకెక్కుతున్న ఈ రోజుల్లో పక్కా ప్లానింగ్ తో సెట్స్ లోకి వెళ్లడం చాలా అవసరం. ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తెరకెక్కించే క్రమంలో కొన్నిసార్లు హీరోలకు అనుకోని గాయాలు అవుతుంటాయి. ఇలాంటి ఊహించని ఘటనలు ఎదురైనప్పుడు మొత్తం షెడ్యూల్స్ కాస్త అటూఇటూ మారడం సహజంగా జరిగే పనే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.

ప్రస్తుతం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సరిగ్గా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. ఒకేసారి ముగ్గురు టాప్ స్టార్ హీరోలు సినిమా షూటింగ్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చి పూర్తిగా రెస్ట్ మోడ్ లోకి వెళ్లారనే టాక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది. ఎప్పుడూ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉండే ఈ స్టార్స్ తమ ఆరోగ్యానికి కాస్త విశ్రాంతి అవసరం అని భావించి తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ఆయా సినిమాల ప్రొడక్షన్ పనులు కూడా కాస్త నెమ్మదించక తప్పలేదు.

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ గురించి. రంగస్థలం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ మొదలుపెట్టనున్నారు. RC 17 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే చరణ్ కు చిన్నపాటి గాయాలు అవ్వడంతో పాటు కాస్త రెస్ట్ అవసరం కావడంతో ఈ మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు టాక్ నడుస్తోంది.

అలాగే ఎన్టీఆర్ అప్ కమింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. బ్లాక్ బస్టర్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సులు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి కష్టమైన భారీ సీన్స్ తీసే క్రమంలోనే తారక్ కు కూడా కొద్దిగా గాయాలు అవ్వడంతో ఆయన కూడా షూటింగ్ పనుల నుంచి విరామం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక తమ వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా కుర్ర హీరోలకు ధీటుగా ఎనర్జిటిక్ సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ లైనప్ కూడా చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు కొరటాల శివతో ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అయితే రీసెంట్ గా ఆయనకు కూడా స్వల్ప గాయాలు అవ్వడంతో ఈ సినిమాల షూటింగ్స్ కు కొంతకాలం పాటు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురు అగ్ర హీరోలు దాదాపు ఆరు వారల పాటు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. శరీరానికి కావాల్సినంత రెస్ట్ ఇచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాతే వీరు మళ్లీ కెమెరా ముందుకు వచ్చి యాక్షన్ చెప్పించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల రాబోయే రిలీజ్ డేట్స్ లో పెద్దగా మార్పులు లేకపోయినా ప్రస్తుతానికి షూటింగ్స్ పరంగా చిన్నపాటి ఆలస్యం అయితే తప్పేలా లేదు.

Tags:    

Similar News