పెద్ది లుక్కుతో చరణ్ స్టైలిష్ స్వాగ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం చరణ్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశారు.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం చరణ్ తన రూపాన్ని పూర్తిగా మార్చేశారు. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో పక్కా మాస్ అవతారంలో కనిపిస్తున్న చరణ్, తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిశారు. ఎస్క్వైర్ ఇండియా ఏప్రిల్ 2026 ఎడిషన్ కోసం ఆయన చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవర్ పేజీపై చరణ్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఆయన గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కు ఇది పర్ఫెక్ట్ లుక్ అనిపిస్తోంది.
ఈ ఫోటోలో చరణ్ స్టైలింగ్ చాలా డిఫరెంట్ గా ఉంది. డార్క్ బ్లూ కలర్ సూట్ ధరించి, కళ్ళజోడు పెట్టుకుని చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. ‘పెద్ది’ సినిమాలోని రగ్గడ్ లుక్ కు, ఈ అల్ట్రా మోడరన్ స్టైలిష్ లుక్ తోడవ్వడంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఒక పక్కా లోకల్ మాస్ కథలో నటిస్తూనే, ఇలాంటి ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ పై తన మార్క్ చూపిస్తున్నారు. ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌లో చైనీస్ అక్షరాలతో ఉన్న బోర్డులు కనిపిస్తుండటం చూస్తుంటే, ఇది ఏదైనా ఫారిన్ లొకేషన్‌లో లేదా ఒక ప్రత్యేకమైన సెట్‌లో తీసినట్లు అర్థమవుతోంది.
అయితే ఈ ఫోటోలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం చరణ్ చేతిలో ఉన్న ఒక చిన్న కుక్క పిల్ల. రామ్ చరణ్‌కు తన పెంపుడు కుక్క ‘రైమ్’ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లినా రైమ్ తోడుగా ఉంటుంది. కానీ ఈ ఫోటోలో ఉన్న కుక్క పిల్ల నల్లటి రంగులో ఉండటంతో, ఇది రైమేనా లేక కొత్తగా తీసుకున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నలుపు రంగులో ఉన్న ఆ డాగ్ ను చరణ్ చాలా ప్రేమగా పట్టుకుని ఉండటం ఈ ఫోటోకు ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చింది.
చరణ్ తన కెరీర్ లో ఎప్పుడూ లేనంతగా ఈ ‘పెద్ది’ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కష్టపడుతున్నారు. సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. జూన్ నెలలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో చరణ్ ఇలాంటి ఫోటోషూట్లతో వార్తల్లో నిలుస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
ఈ మ్యాగజైన్ షూట్ కోసం ఉపయోగించిన కలర్ ప్యాలెట్ లైటింగ్ చరణ్ లుక్ ను మరింత ఎలివేట్ చేశాయి. చేతిలో ఒక చిన్న పూల బొకే పట్టుకుని, స్టైలిష్ గా నడుస్తూ వస్తున్న స్టిల్ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటిది. ఒకవైపు ‘పెద్ది’ లోని ఊర మాస్ గెటప్, మరోవైపు ఈ క్లాస్ అండ్ స్టైలిష్ గెటప్.. చరణ్ లోని వర్సటాలిటీని చాటిచెబుతున్నాయి. ఈ ఫోటో చూసిన వాళ్లంతా చరణ్ లోని ఇంటెన్సిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా ఆయన జుట్టు గడ్డం స్టైలింగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.