• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగా ప‌వర్ స్టార్...

మెగా ప‌వర్ స్టార్ డెబ్యూకి 17 ఏళ్లు!

| హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మీద స్టోరీలు రాయ‌డం పూరి స్పెషాల్టీ.

By - Tupaki Desk
Update: 2024-09-28 08:44 GMT

రామ్ చ‌ర‌ణ్ `చిరుత `చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడిగా చ‌ర‌ణ్ లాంచ్ అయ్యాడు. ఎన్నో ఒత్తిళ్ల మ‌ధ్య ఆ ఛాన్స్ ఏ ద‌ర్శ‌కుడికి ఇస్తే బాగుంటుంద‌ని చిరు ఎన్నో విష‌యాలు ఆలోచించి చివ‌రిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ అయితే బాగుంటుంద‌ని ఆయ‌న చేతుల్లో పెట్టారు. పూరి కూడా చిరు న‌మ్మ‌కాన్ని అంతే నిల‌బెట్టారు. చ‌ర‌ణ్ కి డెబ్యూతోనూ పూరి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చాడు.

త‌న‌ని తొలి సినిమాతోనే పెద్ద స్టార్ని చేసాడు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మీద స్టోరీలు రాయ‌డం పూరి స్పెషాల్టీ. పూరిలో ఈ ట్యాలెంట్ చూసే చిరు అత‌నికి అప్ప‌జెప్పారు. క‌థ సాధార‌ణంగా ప్రారంభ‌మైన లొతుకు వెళ్లేకొద్ది చిరుతో హీరో పాత్ర‌ని ఆవిష్క‌రించిన తీరు అద్బుతం. అటు మ‌ణిశ‌ర్మ సంగీతం సినిమాని నెక్స్ట్ లెవల్లో నిల‌బెట్టింది. సినిమా రిలీజ్ కి ముందు మ్యూజిక‌ల్ గా మంచి విజయం సాధించింది.

తాజాగా ఈ సినిమా విడుద‌లై నేటికి 17 ఏళ్లు పూర్త‌యింది. 17 ఏళ్ల క్రితం ఇదే రోజున (2007, సెప్టెంబ‌ర్ 28న‌) విడుద‌లైంది. దీన్ని గుర్తుచేస్తూ నిర్మాణ సంస్థ వైజయంతీ ఫిల్మ్స్ ఎక్స్ లో ఓ పోస్ట్‌ చేసింది. ఇప్పుడీ ట్వీట్‌ను చ‌ర‌ణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైర‌ల్ చేస్తున్నారు. `17 ఏళ్ల క్రితం ఇదే రోజున గ్లోబల్ స్టార్ ఎదుగు దలను ప్రపంచం చూసింది. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా వ‌చ్చిన తొలిచిత్రం చిరుత బాక్సాఫీస్ వ‌ద్ద‌ తుఫానులా తీసుకు వెళ్లింది.

చెర్రీ అద్భుతమైన సినిమా ప్రయాణానికి వేదికగా నిలిచింది` అంటూ ట్వీట్ చేసింది. మెగా అభిమానుల్లో చ‌ర‌ణ్ క్రేజ్... చిరుత‌లో అత‌డి పెర్పార్మెన్స్ చూసి రాజ‌మౌళి రెండ‌వ ప్ర‌య‌త్నంగా `మ‌గ‌ధీర` చేసారు. రెండ‌వ సినిమాతో ఏకంగా చ‌ర‌ణ్ ని 100 కోట్ల క్ల‌బ్ లో చేర్చాడు. ఆ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ జ‌ర్నీ ఎలా సాగుతుందో తెలిసిందే.

On this day, 17 years ago, the world witnessed the rise of a Global Star! 🌟 #Chirutha, the iconic film that introduced @AlwaysRamCharan to the world, took the box office by storm and set the stage for an incredible cinematic journey. @VyjayanthiFilms @adityamusic#Chirutha… pic.twitter.com/X0d33CA6T1

— FirstShowz 🇮🇳 (@firstshowz) September 28, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Chirutha 
  • Ramcharan 
  • NehaSharma 
  • PuriJagganadh 
  • Socialmedia 
  • Tweet 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS