'చికిరి చిరికి' కి డాక్టర్స్ సైతం రీక్రియషన్!
వాకింగ్ చేయలేని వాళ్లు...కూర్చుని ఆఫీస్ పనులకే పరిమితమైన వాళ్లు..ఇలా తిరగడానికి వీలు లేని వాళ్లంతా కూర్చునే చికిరి చికిరి స్టెప్ వేయోచ్చు అంటున్నారు.;
డాన్స్ శరీరానికి మంచి వ్యాయామం లాంటిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే కొరియోగ్రాఫర్స్ అంత ఫిట్ గా ఉంటారు. వారు ప్రత్యేకంగా వ్యాయామాలు చేయాల్సిన పనిలేదు. ప్రత్యేకించి డైట్లు కూడా ఫాలో అవ్వాల్సిన పనిలేదు. డాన్స్ అన్నది వారి జీవితంలో భాగం కావడంతో? ఎప్పుడూ ఫిట్ గా కనిపిస్తుంటారు. తాజాగా `చికిరి చికిరి` సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట ఇండియాని ఊపేస్తుంది. రెహమాన్ బీట్స్ కు చరణ్ క్లాసిక్ స్టెప్స్ తోడవ్వడంతో? రికార్డుల మోత మోగిస్తోంది.
గుండె ఆరోగ్యం పదిలం:
యూ ట్యూబ్ లో 100మిలియన్ వ్యూస్ కి అతి చేరువలో ఉంది. అయితే ఇందులో స్టెప్స్ తో ప్రత్యేకించి గుండె ఆరోగ్యం పదిలమని ఓ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఈస్టెప్స్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుందన్నారు. ఆక్సిజన్ సరఫరా బాగా జరగడంతో? హార్ట్ రేట్ స్థిరంగా ఉంటుందన్నారు. మరి ఈస్టెప్స్ ను యువత, వయసులో ఉన్న వాళ్లు వేయగలరు. వయసు మళ్లిన వారి సంగతేంటి? అంటే ఈ పాట స్పూర్తితో డాక్టర్స్ సైతం సొంతంగా స్టెప్స్ ఐడియాలు ఇస్తున్నారు. వయసు మళ్లిన వారు అందుకోసం డాన్స్ చేయాల్సిన పనిలేదు.
చికిరి చికిరి రీయేక్రియేషన్:
వాకింగ్ చేయలేని వాళ్లు...కూర్చుని ఆఫీస్ పనులకే పరిమితమైన వాళ్లు..ఇలా తిరగడానికి వీలు లేని వాళ్లంతా కూర్చునే చికిరి చికిరి స్టెప్ వేయోచ్చు అంటున్నారు. కుర్చీలో కుర్చిన పాదాలను నేల మీద సమానంగా పెట్టి నీస్ ని పైకి లేపాలి. అదే పోజిషన్ లో కూర్చుని కాళ్లను పైకి లేపి యాంకిల్స్ ని అటూ ఇటూ మూవ్ చేయడం ద్వారా కూడా మంచి వ్యాయామం చేసినట్లే అంటున్నారు. ఆ డాక్టర్ కు కూడా ఈ ఐడియా `చికిరి చికిరి` స్టెప్స్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వాకింగ్ లో ఉండే అడ్వాంటేజెస్ అన్ని దాదాపు అలా చేయడం ద్వారా కవర్ అవుతాయన్నారు.
పుల్ సాంగ్ తో ఇంకెన్ని సంచలనాలో:
మొత్తానికి రామ్ చరణ్ `చికిరి చికిరి` స్టెప్స్ జనాలకు ఈ రకంగా కూడా ఉపయోగపడుతుందన్న మాట. `పెద్ది` నుంచి రిలీజ్ అయిన తొలి లిరికల్ సాంగ్ ఇది. ఇంకా ఈ పాటలో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి? అన్నది రిలీజ్ తర్వాత తేలుతుంది. అలాగే రెహమాన్ మరిన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు. వాటికి ఫస్ట్ క్లాస్ కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నారు. దీంతో ఆ పాటల్లో ఎలాంటి సిగ్నెచర్ స్టెప్స్ ఉంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం `పెద్ది` సినిమా ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.