బాడీగార్డ్ 4 ఏళ్లుగా స‌ర్వీస్ చేస్తున్నా ఇన్నాళ్టికి గుర్తింపు: నెట్టింట వైరల్‌గా మారిన కెవిన్!

నాలుగు సంవత్సరాలుగా చరణ్ వద్దే సర్వీస్ అందిస్తున్నా.. 'పెద్ది' ఈవెంట్స్ పుణ్యమా అని ఇప్పుడతడికి ఇన్‌స్టంట్‌గా గుర్తింపు, లైమ్‌లైట్‌లో విపరీతమైన ప్ర‌చారం దక్కింది.

Update: 2026-06-02 07:33 GMT

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా ఆయన నీడలా ఒక భారీ కాయుడు కనిపిస్తున్నాడు. అతడే చరణ్ పర్సనల్ బాడీగార్డ్ కెవిన్. ప్రస్తుతం `పెద్ది` సినిమా ప్రమోషన్స్ కోసం చరణ్ ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ మీద పడకుండా ఆపేది, రక్షణ కల్పించేది అతడే. అయితే ఈ మధ్య కాలంలో కెవిన్ అద్భుతమైన బాడీ లాంగ్వేజ్- భారీ ఫిజిక్ చూసి మెగా అభిమానులతో పాటు ముఖ్యంగా అమ్మాయిలు సైతం స్టన్ అయిపోతున్నారు. నాలుగు సంవత్సరాలుగా చరణ్ వద్దే సర్వీస్ అందిస్తున్నా.. `పెద్ది` ఈవెంట్స్ పుణ్యమా అని ఇప్పుడతడికి ఇన్‌స్టంట్‌గా గుర్తింపు, లైమ్‌లైట్‌లో విపరీతమైన ప్ర‌చారం దక్కింది.




 



పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో జన్మించిన 27 ఏళ్ల కెవిన్ వృత్తిరీత్యా ప్రొఫెషనల్ ఎమ్ఎమ్ఏ (MMA) ఫైటర్. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో స్థిరపడిన ఇతడికి అంతర్జాతీయ ఫైటింగ్ సర్కిల్స్ లో గొప్ప విజయాల హిస్టరీ ఉంది. ఇంతటి ఘనమైన బ్యాక్‌గ్రౌండ్ ఉన్న బాడీగార్డ్ కావడంతోనే రామ్ చరణ్ ఇతడికి భారీ పారితోషిక‌మే ఇస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. సెలబ్రిటీలకు రక్షణ కల్పించడంలో బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల బాడీగార్డుల కంటే కూడా కెవిన్ ఎంతో బలంగా, ధృఢంగా కనిపిస్తున్నాడని ప్రశంసలు కురుస్తున్నాయి.




 



రామ్ చరణ్ త‌న‌కు, త‌న పిల్లలు, కుటుంబానికి ఒక మంచి అంగ‌ర‌క్ష‌కుడిని నియ‌మించాల‌నుకుని నాలుగేళ్ల క్రిత‌మే కెవిన్ ని ఎంపిక చేసుకున్నార‌ట‌. ఈ నాలుగేళ్లుగా అతడు నిరంతరం త‌న‌ వెంటే ఉంటూ అంగరక్షకుడిగా వ్యవహరిస్తున్నాడ‌ని చ‌ర‌ణ్ కూడా ధృవీక‌రించారు. అత‌డు ఒక ఫైట‌ర్ అనే కోణంలో కాకుండా ఒక మంచి ర‌క్ష‌కుడిగా ఉంటాడ‌నే చ‌ర‌ణ్ అత‌డిని ఎంపిక చేసుకున్నార‌ట‌. అయితే కెవిన్ ఎంఎంఏ ఫైట‌ర్ కావ‌డంతో రామ్ చరణ్ పేరు ఇప్పుడు హాలీవుడ్ ఫైటింగ్ సర్కిల్స్‌లో కూడా విపరీతంగా ఫేమస్ అయిపోతోంది. `పెద్ది` సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతున్న ఈ స‌మ‌యంలో కెవిన్ పేరు కూడా మార్మోగుతోంది.





 

ఇక తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన బాడీగార్డ్ గురించి చెబుతూ ఒక ఫన్నీ పంచ్ లైన్ వేశారు. ``నేను అతడిని అస్సలు బయటకు వెళ్లనివ్వడం లేదు.. ఎవరైనా అతనికి ఒక చాక్లెట్ లేదా బిస్కెట్ లంచం ఇచ్చి... నా గురించి విషయాలు కక్కించేస్తారేమోనని భయం`` అంటూ చరణ్ నవ్వుతూ కామెంట్ చేశారు. ఈ సరదా వ్యాఖ్యలను చూసిన నెటిజన్లు..త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది ఈనెల 4న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతోంది. కెవిన్ శిక్ష‌ణ‌లో చెర్రీ ఎంఎంఏ ఫైట్ లో ఎలా రాటుదేలాడో తెర‌పై వీక్షించాల్సిందే.




 




 


Tags:    

Similar News