అయ్యప్ప మాలలో చరణ్ షూటింగ్ ఇదే తొలిసారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప స్వామికి గొప్ప భక్తుడు. ఏటా అయ్యప్ప మాల వేయడం పరిపాటే. ఏడాదిలో రెండుసార్లు అయినా మాల వేస్తుంటారు.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయ్యప్ప స్వామికి గొప్ప భక్తుడు. ఏటా అయ్యప్ప మాల వేయడం పరిపాటే. ఏడాదిలో రెండుసార్లు అయినా మాల వేస్తుంటారు. అంతకు ముందు చిరంజీవి కూడా ఇలాగే అయ్యప్ప మాల ధరించేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో చరణ్ ఎక్కువగా మాలలో కనిపిస్తున్నారు. ఎంతో నియమ నిష్టలతో చరణ్ అయ్య దీక్ష చేస్తుంటారు. మాలలో ఉన్నంత కాలం దేవుడిపై మనసు లగ్నం చేయడం అన్నది ఎంతో అద్భుతంగా ఉటుందన్నది? చరణ్ అభిప్రాయం.
షాక్ లో ఫ్యాన్స్ సైతం:
తన షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా? ఏడాదిలో రెండు సార్లు మాల ధరిస్తుంటారు. ఓసారి మాత్రం తప్ప కుండా కేరళలోనే మాల విసర్జన చేస్తుంటారు. మరోసారి తనకు అందుబాటులో ఉన్న దేవాలయంలో మాల విసర్జన చేస్తుంటారు. ప్రస్తుతం చరణ్ మాలలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మాలలో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. `పెద్ది` షూటింగ్ ముమ్మరంగా జరుగుతోన్న సమయంలో చరణ్ మాలలో కనిపించడం కాస్త షాకింగ్ అనిపించినా? తప్పని దీక్ష కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే.
మళ్లీ మైసూరులోనే:
అయితే ఓ సినిమా షూటింగ్ దశలో ఉండగా మాల వేడయం అన్నది ఇదే తొలిసారి అని అభిమానులు అంటున్నారు. చరణ్ గతంలోనూ చాలాసార్లు మాల వేసారు. కానీ సినిమాలు రిలీజ్ అనంతరమో...కొత్త ప్రాజెక్ట్ లు మొదలవుతాయి అన్నప్పుడో? లేక చరణ్ అవసరం లేకుండా టీమ్ ఉన్న సందర్భంలో తప్ప! ఇలా షూటింగ్ జరుగుతోన్న సమయంలో మాల వేయలేదన్నది అభిమానుల మాటగా తెరపైకి వస్తోంది. ప్రస్తుతం `పెద్ది` షూటింగ్ మళ్లీ మైసూర్ లో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ జరగనుంది.
చరణ్ కూడా చాలా ఆశలతోనే:
అంతకుముందు ఓ సాంగ్ కూడా అక్కడే చిత్రీకరించనున్నారు. చరణ్ మాలలో ఉన్న షూటింగ్ పాల్గొ నడానికి రెడీ అవుతున్నారుట. దీంతో మాలలో షూట్ కి హాజరవ్వడం చరణ్ కి కూడా కొత్త అనుభవమే. అక్కడి షెడ్యూల్ అనంతరం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. తొలి షెడ్యూల్ మైసూర్ లోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్ కి సంబంధించిన కంటున్యూషన్ సన్నివేశాలే త్వరలో చిత్రీకరించనున్నారని తెలిసింది. పెద్ది విజయం రామ్ చరణ్‌కి కీలకం. `ఆర్ ఆర్ ఆర్` విజయం తర్వాత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `గేమ్ ఛేంజర్` ప్లాప్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు. ఆ లెక్కలు సరి చేయాలంటే `పెద్ది` రూపంలో విజయం తప్పనిసరి. ఈప్రాజెక్ట్ పై రామ్ చరణ్ చాలా ఆశలు పెట్టుకున్నారు.