భాగ్యానికి లక్ కలిసి రావాలంటే..?
ఇక భాగ్య శ్రీ లేటెస్ట్ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేశాడు.;
బాలీవుడ్ నుంచి మాస్ మహారాజ్ రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్స్. మిస్టర్ బచ్చన్ టైం లో అమ్మడు ఆడియన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఆమె లుక్స్, ప్రమోషన్స్ లో యాక్టివ్ నెస్ అన్నీ నచ్చేశాయి. ఐతే మిస్టర్ బచ్చన్ రిజల్ట్ మాత్రం డిజప్పాయింట్ చేసింది. ఇక ఆ నెక్స్ట్ వచ్చిన విజయ్ దేవరకొండ కింగ్ డమ్ అయినా కెరీర్ కి పుష్ ఇస్తుంది అనుకుంటే అది కూడా మిస్ ఫైర్ అయ్యింది. సినిమాలో ఆమె హీరోయిన్ కాదు ఒక చిన్న రోల్ చేసింది అనిపించేలా షాక్ ఇచ్చింది.
రామ్ తో లవ్ స్టోరీ అంటే హీరోయిన్స్ కి బూస్టింగ్..
ఇక భాగ్య శ్రీ లేటెస్ట్ సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేశాడు. సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటించింది. రామ్ తో లవ్ స్టోరీ అంటే హీరోయిన్స్ కి మంచి బూస్టింగ్ ఇస్తుంది. రామ్, భాగ్య శ్రీ జోడీ కూడా అదిరిపోయింది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు.
సినిమాలో భాగ్య శ్రీకి మంచి రోల్ దక్కినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాతో భాగ్య శ్రీకి లక్ కలిసి రావాల్సిందే. ఎందుకంటే మొదటి రెండు సినిమాలు కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. కానీ ఈ సినిమా బజ్ చూస్తుంటే భాగ్యానికి ఫస్ట్ సూపర్ హిట్ పడేలా ఉంది. భాగ్య శ్రీ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా సక్సెస్ అయితేనే తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
రామ్, భాగ్య శ్రీ ఈ జోడీ చూసి మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా..
ఐతే రిజల్ట్ తో పని లేకుండా అవకాశాలు వస్తాయి. కానీ ఏదో ఒక సినిమాతో అమ్మడు ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి సినిమానే ఆంధ్రా కింగ్ తాలూకా అంటున్నారు. రామ్, భాగ్య శ్రీ ఈ జోడీ చూసి మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా ఈ జంట కెమిస్ట్రీ ఉంటుందట. మరి భాగ్య శ్రీ ఈ సినిమాతో నిజంగానే హిట్ కొడుతుందా లేదా అన్నది చూడాలి. నవంబర్ నెల ఆఖరున రిలీజ్ అవుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు అన్నీ పాజిటివ్ అంశాలే ఉన్నాయి. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కచ్చితంగా ఆంధ్రా కింగ్ తాలూకా తో భాగ్య శ్రీ హిట్ బోణి తెరిస్తే అమ్మడికి ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు.
ఆంధ్రా కింగ్ తాలూకతో పాటు దుల్కర్ సల్మాన్, రానా నటిస్తున్న కాంత సినిమాలో ఛాన్స్ అందుకుంది భాగ్య శ్రీ. అంతేకాదు అఖిల్ అక్కినేని లెనిన్ లో కూడా శ్రీలీల ప్లేస్ లో భాగ్య శ్రీ నటిస్తుందని టాక్.