ఈ లైఫ్ కోసం ఎన్నో త్యాగాలు చేశా
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న రకుల్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది.;
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న రకుల్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లింది. గత కొంతకాలంగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ కు వెళ్లి అక్కడ సినిమాలు చేస్తూ తన సత్తా చాటాలని చూస్తోంది.
గతేడాది జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్, రీసెంట్ గా మేరే హస్బెండ్ కీ బీవీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దే దే ప్యార్ దే 2 సినిమాలో నటిస్తున్న రకుల్ ఇప్పుడు తన డ్రీమ్ లైఫ్ ను జీవిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది. రకుల్ చిన్నప్పటి నుంచి వెండి తెరపై కనిపించాలని ఎన్నో కలలు కనిందట.
చిన్నప్పట్నుంచి నటి అవాలని ఎన్నో కలలు కన్న తాను ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్ట పడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని, తాను పడిన కష్టానికి చేసిన త్యాగాలకు ప్రస్తుతం తాను డ్రీమ్ లైఫ్ ను అనుభవిస్తున్నట్టు రకుల్ పేర్కొంది. కన్న కలలు నిజమవాలంటే టాలెంట్ తో పాటూ అదృష్టం కూడా అవసరం. ఈ రెండూ రకుల్ కు పుష్కలంగా ఉండబట్టే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది.
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ, అందంగా ఉంటేనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించగలరు అనే స్టేట్‌మెంట్ ను కూడా రకుల్ కొట్టిపారేసింది. అందం అనేది లోపల దాగి ఉంటుందని, అది పైకి కనిపించేది కాదని రకుల్ తెలిపింది. అందం మన నవ్వులో, కళ్లలో కనిపించాలని, అలా కనిపిస్తే ప్రతీ ఒక్కరూ అందంగానే కనిపిస్తారని రకుల్ చెప్తోంది.
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ దే దే ప్యార్ దే2 తో పాటూ సైఫ్ అలీఖాన్ తో కలిసి రేస్4 లో నటించే ఛాన్స్ ను అందుకుంది. ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని చెప్తోన్న రకుల్ నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న రామాయణంలో కూడా ఆఫర్ అందుకుందని వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.