బ్లాక్ గౌనులో సెగలు పుట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్!
అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఈ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా మరొకవైపు ఫాలోవర్స్ ను, నెటిజన్స్ ను ఆకట్టుకోవడానికి ఇలా వరుస ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన అందాల సోయగాలతో మరొకసారి అభిమానులను మైమరిపింపచేసే ప్రయత్నం చేసింది .
బ్లాక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ లుక్ ఇచ్చిన రకుల్..
అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా పంచుకున్న ఈ అవుట్ ఫిట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులకు ఇదొక ట్రెండీ ఔట్ఫిట్ గా నిలిచింది .అందులో గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ బ్లాక్ గౌన్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేలా సిల్వర్ కలర్ బ్లాక్ కలర్ ఫింగర్ రింగ్స్ ధరించిన ఈమె.. జుట్టును వేవ్ లా వదిలేసి సింపుల్ స్మైల్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫ్రాక్ కి తగ్గట్టుగా బోసి నెక్ తో.. నడుము మీద చెయ్యి పెట్టి వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. మరికొన్ని ఫోటోలలో సెల్ఫీతో ఆకట్టుకుంది. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన ఈ ఫోటో గ్యాలరీ అభిమానులను ఆకట్టుకుంటుంది.
థియేటర్లోకి వచ్చిన రకుల్ కొత్త సినిమా..
ఇదిలా ఉండగా ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా నటించిన చిత్రం పతి పత్నీ ఔర్ దో.. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా, రకుల్ ప్రీత్ సింగ్ , సారా అలీ ఖాన్, వామికా గబ్బిలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను టీ సిరీస్, బి.ఆర్ స్టూడియోస్ బ్యానర్లపై రేణు రవి చోప్రా, కృష్ణన్ కుమార్ , భూషణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకి ముదసర్ అజీజ్ దర్శకత్వం వహించారు. విజయ రాజ్, దుర్గేష్ కుమార్, దీపిక అమీన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఈ సినిమా మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం.
రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్..
కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన రకుల్ ప్రీత్ సింగ్.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకున్న ఈ బ్యూటీ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే మన్మధుడు వంటి చిత్రంలో నటించి విమర్శలు ఎదుర్కొంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడ వరుస విజయాలను అందుకుంటూ తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా తన నటనకు తగ్గట్టుగా అవార్డుల రూపంలో గౌరవాలను కూడా అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.