నందిని నెక్స్ట్.. గ్యాప్ యూజ్ చేసుకుంటేనే బెటరేమో..
సినీ పరిశ్రమలో ఒక హిట్ తర్వాత వచ్చే గ్యాప్ చాలా కీలకం. ఆ సమయంలోనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే దర్శకుల కెరీర్ లో మంచి జోష్ కొనసాగుతుంది.
సినీ పరిశ్రమలో ఒక హిట్ తర్వాత వచ్చే గ్యాప్ చాలా కీలకం. ఆ సమయంలోనే మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే దర్శకుల కెరీర్ లో మంచి జోష్ కొనసాగుతుంది. లేదంటే కొత్త సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి విషయంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. మా ఇంటి బంగారంతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె.. నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
విభిన్న కథలు ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, ఎమోషన్స్ ను స్క్రీన్ పై సున్నితంగా చూపించడంలో ఆమెకు ప్రత్యేకమైన శైలి ఉంది. అలా మొదలైందితో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నందిని.. ఆ తర్వాత కూడా తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓ బేబీ ఆమె కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచింది.
ఇప్పుడు మా ఇంటి బంగారంతో మరోసారి ఆమె పేరు చర్చలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఆమె నెక్స్ట్ ప్రాజెక్టుపై సరైన అనౌన్స్మెంట్ రాలేదు. మరోవైపు మా ఇంటి బంగారం మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రకటన రావడంతో నందిని ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగింది. అయితే ఆ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సమంత ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్ లో ఉండటంతో సీక్వెల్ ప్రారంభానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. సీక్వెల్ కోసం ఎదురుచూస్తూ నందిని గ్యాప్ తీసుకుంటారా? లేక మరో సినిమాను పట్టాలెక్కిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతోంది. ప్రీ ప్రొడక్షన్ నుంచి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏడాది సమయం అవసరమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన గ్యాప్ ఉపయోగించుకోవడం కెరీర్ పరంగా కీలకమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నందిని బలం భారీ బడ్జెట్ సినిమాలు కాదు. సింపుల్ కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్ తో ప్రేక్షకులను మెప్పించడం ఆమె ప్రత్యేకత. అందుకే గ్యాప్ లో మీడియం బడ్జెట్ తో మరో మూవీ తెరకెక్కిస్తే బాగుంటుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. స్టార్ హీరోలు, భారీ సెట్స్ అవసరం లేకుండానే తన కథతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగల సామర్థ్యం నందినికి ఉందని గుర్తు చేస్తున్నారు. పైగా ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ మారింది.
కథలో కొత్తదనం, ఎమోషన్స్ ఉంటే చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పరిస్థితులను నందిని రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకుంటే.. సీక్వెల్ ప్రారంభమయ్యేలోపు మరో ప్రాజెక్ట్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దర్శకులకు సక్సెస్ ఎంత ముఖ్యమో.. ఆ సక్సెస్ తర్వాత కెరీర్ లో స్పీడ్ కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే మా ఇంటి బంగారం సీక్వెల్ కోసం ఎదురుచూడకుండా మధ్యలో మరో కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే నందిని రెడ్డికి కెరీర్ పరంగా ఉపయోగపడుతుందనే చర్చ జరుగుతోంది.