వీడియో: అదుపు తప్పిన థై స్లిట్ సొగసు..వీళ్లకు డ్రెస్సింగ్ సెన్స్ నేర్పించేది ఎవరు?`
వీరిద్దరి గ్లామర్ డోస్ ముందు సీనియర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొంత వెలవెలబోయిందనే వ్యాఖ్యలు నెట్టింట వినిపిస్తున్నాయి. ముఖ్యంగా థై స్లిట్ లుక్‌లో సారా, వామికా పోటీ పడటంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది.;
సినిమా ప్రమోషన్స్ అంటే కేవలం ముచ్చట్లు మాత్రమే కాదు.. తారల ఫ్యాషన్ మెరుపులు బోనస్ ట్రీట్ కూడా ఉంటుందనడానికి ఇదో చక్కని ఉదాహరణ. తాజాగా `పతి పత్ని ఔర్ వో 2` చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సారా అలీ ఖాన్, వామికా గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ ముగ్గురూ కలిసి సందడి చేశారు. అయితే ఈ వేడుకలో సారా అలీ ఖాన్ - వామికా గబ్బి ధరించిన బో*ల్డ్ థై స్లిట్ డ్రెస్సులు అందరి దృష్టిని ఆకర్షించాయి. వీరిద్దరి గ్లామర్ డోస్ ముందు సీనియర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొంత వెలవెలబోయిందనే వ్యాఖ్యలు నెట్టింట వినిపిస్తున్నాయి. ముఖ్యంగా థై స్లిట్ లుక్‌లో సారా, వామికా పోటీ పడటంతో నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది.
ఈ ప్రమోషనల్ ఈవెంట్ కోసం సారా అలీ ఖాన్ ఫ్యూచరిస్టిక్ స్నేక్ స్కిన్ డిజైన్‌తో కూడిన సిల్వర్ మెటాలిక్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. హై థై స్లిట్ డ్రెస్ సారాకు అత్యంత స్పెషల్ వైబ్ ని తీసుకొచ్చింది. సాధారణంగా క్లాసీగా కనిపించే సారా ఒక్కసారిగా ఈ రేంజులో రిస్కీ ఫ్యాషన్‌ను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వామికా గబ్బి కూడా ఏమాత్రం తగ్గకుండా బ్లాక్ అండ్ వైట్ లెపార్డ్ ప్రింట్ వన్-షోల్డర్ డ్రెస్సులో మెరిసింది. ఆ ఇద్దరు భామల హై స్లిట్ షోని మరింత గ్లామరైజ్ చేసిందనే చెప్పాలి.
అయితే ఈ ముగ్గురు భామల ఫ్యాషన్ ఎంపికలపై సోషల్ మీడియాలో.. ముఖ్యంగా `రెడిట్`లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్యాషన్ ప్రయోగాలు బావున్నా..ఈ అవుట్‌ఫిట్స్ మరీ చౌకగా అవుట్ డేటెడ్ స్టైల్‌లో ఉన్నాయని కొందరు నెటిజన్లు పెదవి విరిచేస్తున్నారు. ``వీరికి డ్రెస్సింగ్ సెన్స్ నేర్పించేది ఎవరు?` అంటూ కొందరు ఎద్దేవా చేస్తుంటే.. సినిమా ప్రమోషన్ కంటే డ్రెస్సుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని.. ఇది చిత్ర యూనిట్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ ధరించిన భారీ లెపార్డ్ ప్రింట్ అవుట్‌ఫిట్ తన బాడీ ఫ్రేమ్‌కు ఏమాత్రం నప్పలేదని విమర్శలు వస్తున్నాయి. గోల్డ్ టోన్ క్రాప్ టాప్ .. భారీ బెలూన్ స్లీవ్స్ ఈ సీనియర్ బ్యూటీ లుక్‌ను దెబ్బతీశాయని ఫ్యాషన్ ప్రియులు భావిస్తున్నారు. ఇక సారా అలీ ఖాన్ తన సహజమైన `రాయల్` లుక్‌ను పక్కన పెట్టి ఇలాంటి మెటాలిక్ షేడ్స్‌లోకి మారడం అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఈ డ్రెస్సులన్నీ చూస్తుంటే `కరోల్ బాగ్` మార్కెట్ వైబ్స్ వస్తున్నాయంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి `పతి పత్ని ఔర్ వో 2` ప్రమోషన్స్‌లో ఈ ముగ్గురు భామలు తమ గ్లామర్‌తో హీట్ పెంచాలని చూసినా.. అది కాస్తా ఫ్యాషన్ డిజాస్టర్‌గా మారిందని నెటిజన్లు తీర్పునిస్తున్నారు. నటీమణులు తమ స్టైలిస్టులను ఎంచుకోవడంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే గ్లామర్ కాస్తా గాడి తప్పే ప్రమాదం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. అందం ఉన్నా.. సరైన ఫ్యాషన్ ఎంపిక లేకపోతే అది ఎంతటి స్టార్ హీరోయిన్‌కైనా ఇబ్బందికరంగా మారుతుందనడానికి ఈ ఈవెంట్ ఒక ఉదాహరణ అంటూ కామెంట్లు చేస్తున్నారు.