ప్రేక్షకుల మనసు గిల్లేస్తున్న పల్లెటూరి ప్రేమకథ..!
ఐతే ఒక ప్రేమ కథ అది కూడా నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా అంటే ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఉంటుంది.;
తెలుగు సినిమా ఓ పక్క వందల కోట్ల బడ్జెట్ తో మన ఇమాజినేషన్ కి కూడా అందరి సినిమాలను.. విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.. ఐతే వాటికి సమాంతరంగా మరిన్ని రూటెడ్ సినిమాలు ఫ్రెష్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక వయసులో ప్రేమ పుడుతుంది. అది వారిని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది అన్నది వాళ్లు తీసుకునే నిర్ణయాలను బట్టే ఉంటుంది. వెండితెర మీద ఇప్పటికే ఎన్నో వేల ప్రేమ కథలు వచ్చాయి. దేనికదే ప్రత్యేకంగా చెప్పుకునేలా ఉంటాయి. ఐతే ఒక ప్రేమ కథ అది కూడా నిజ జీవిత సంఘటనలతో తీసిన సినిమా అంటే ఆడియన్స్ లో మరింత ఆసక్తి ఉంటుంది.
ఆడియన్స్ గుండె బరువెక్కేలా..
అలాంటి సినిమాలు కూడా చాలానే వచ్చాయి. లేటెస్ట్ గా అలాంటి రియల్ లవ్ స్టోరీతో వచ్చిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్, తేజశ్వి లీడ్ రోల్స్ గా నటించారు. చిన్న సినిమానే అయినా సరే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సినిమా గురించి ముందు నుంచి క్లైమాక్స్ పోర్షన్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.
నిజంగానే సినిమా చూసిన ఆడియన్స్ కి గుండె బరువెక్కేలా చేశాడు దర్శకుడు. రాజు వెడ్స్ రాంబాయి ఒక సిన్సియర్ ఎఫర్ట్ అని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా విలేజ్ లవ్ స్టోరీగా ఆ ఫ్రెష్ నెస్.. 15 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇలా ప్రతి విషయంలో దర్శకుడు జాగ్రత్త వహించాడు. పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది అంటే అది సక్సెస్ అయినట్టే. నిన్న రిలీజైన సినిమా చూసిన ఆడియన్స్ కూడా సూపర్ అనేస్తున్నారు.
చైతన్య జొన్నలగడ్డ విలనిజం పీక్స్..
డైరెక్టర్ సాయిలు చెప్పినట్టుగానే ఇది యూత్ ఆడియన్స్ ముఖ్యంగా ఆల్రెడీ ప్రేమలో ఉన్న లవర్స్ కి హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ సిన్సియర్ ఎఫర్ట్.. లీడ్ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చైతన్య జొన్నలగడ్డ విలనిజం పీక్స్ అనేస్తున్నారు ఆడియన్స్. ఆఫ్టర్ గ్యాప్ శివాజీరాజా, అనితా చౌదరి కూడా వారి పాత్రలో ఆడియన్స్ ని టచ్ చేశారు.
సో రాజు వెడ్స్ రాంబాయి సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది. ఒక పల్లెటూరి ప్రేమ కథ.. ఎలాంటి కమర్షియాలిటీ లేకుండా తీసిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో ఇలాంటి మరిన్ని ప్రేమ కథలు తెర మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.
స్వచ్చమైన ప్రేమ కథలు తెర మీద ఎప్పుడు సూపర్ హిట్ అవుతాయి. వాళ్ల ప్రేమ ఫెయిల్ అవుతుందేమో కానీ సినిమా రూపంలో ప్రేక్షకుల హృదయాల్లో సక్సెస్ అవుతుంది.. చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజు వెడ్స్ రాంబాయి ప్రేమ కథే కానీ నిజమైన కథగా ప్రేక్షకులు తమ స్పందన తెలియచేస్తున్నారు.