రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్.. రెండో రోజు అంతకుమించి..

ఇండియా మొత్తం రెండు రోజుల గ్రాస్ 4 కోట్లు దాటింది. ఇది ఒక చిన్న సినిమాకు, అందులోనూ కొత్త దర్శకుడు, కొత్త హీరో హీరోయిన్లతో వచ్చిన సినిమాకు రికార్డు ఓపెనింగ్ అని చెప్పాలి.;

Update: 2025-11-23 08:01 GMT

ఈ వారం థియేటర్ల దగ్గర చిన్న సినిమాల మధ్య ఒక డిఫరెంట్ ఫైట్ నడుస్తోంది. పెద్ద హీరోల సినిమాలు లేకపోయినా, పోటీ మాత్రం గట్టిగా ఉంది. ఈ పోరులో సర్ప్రైజ్ కలెక్షన్స్ అందుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి'. దాదాపు కొత్త నటీనటులు ఉన్న ఈ చిత్రం, తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా చూపిస్తున్న సత్తా చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

 

'రాజు వెడ్స్ రాంబాయి' తొలి రెండు రోజుల్లో నైజాంలోనే రూ.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియా మొత్తం రెండు రోజుల గ్రాస్ 4 కోట్లు దాటింది. ఇది ఒక చిన్న సినిమాకు, అందులోనూ కొత్త దర్శకుడు, కొత్త హీరో హీరోయిన్లతో వచ్చిన సినిమాకు రికార్డు ఓపెనింగ్ అని చెప్పాలి. ఈ కలెక్షన్ చూసి, సినిమా బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తోందని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

మొదటి రోజు కంటే రెండవరోజు ఇంకా ఎక్కువ కలెక్షన్లు రావడం మరో హైలెట్ పాయింట్. ఈ సక్సెస్ వెనుక ఉన్న ట్రిపుల్ ఫార్ములా ఏంటంటే.. దర్శకుడి బోల్డ్ ఛాలెంజ్, తక్కువ టికెట్ ధరలు కథలో ఉన్న ఎమోషన్. దర్శకుడు సాయిలు కంపాటి సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా తిరుగుతానని ఓపెన్ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఈ సంచలన ప్రకటన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని ఫ్రీగా తెచ్చిపెట్టింది.

ఈ హైప్ కు తోడు, సినిమా టికెట్ ధరలు కేవలం 99 గా ఉండటం పెద్ద ప్లస్ అయింది. తక్కువ ధర ఉండటంతో, ఫ్యామిలీ ఆడియన్స్ రిస్క్ లేకుండా థియేటర్లకు వచ్చారు. చిన్న సినిమాకు వాల్యూమ్ ముఖ్యం కాబట్టి, ఈ స్మార్ట్ ప్రైసింగ్ టెక్నిక్ అద్భుతంగా పనిచేసింది. ఈ విధంగా మేకర్స్ వ్యూహం సినిమాకు మంచి స్టార్ట్ ఇచ్చాయి.

అయితే, ఈ ఓపెనింగ్స్ నిలబడాలంటే సినిమా కంటెంట్ లో దమ్ము ఉండాలి. రాజు వెడ్స్ రాంబాయి ఒక నిజ జీవిత ప్రేమకథ. క్లైమాక్స్ లో వచ్చే షాకింగ్ ట్విస్ట్ ఆడియన్స్ ను ఎమోషనల్గా డిస్టర్బ్ చేస్తోంది. నటీనటులు వారి పాత్రల్లో చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా చైతు జొన్నలగడ్డ పోషించిన విలన్ పాత్రకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మొత్తానికి, కంటెంట్ బోల్డ్ మార్కెటింగ్ స్మార్ట్ ప్రైసింగ్ అనే కాంబినేషన్ 'రాజు వెడ్స్ రాంబాయి'కి బ్లాక్ బస్టర్ స్టార్ట్ ఇచ్చింది. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఓపెనింగ్స్ చూస్తుంటే చిన్న సినిమాలు కూడా సరైన ప్లానింగ్ తో వస్తే పెద్ద సినిమాలుగా మారవచ్చని రుజువవుతోంది.

Tags:    

Similar News