నయా స్టార్ రేంజ్ రెట్టింపు అయిందా?
బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు ఎంతటి నేచురల్ పెర్పార్మర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.;

బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు ఎంతటి నేచురల్ పెర్పార్మర్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. రియలిస్టిక్ పాత్రలు పోషించాలంటే రాజ్ కుమార్ మాత్రమే పోషించాలి. అతడి నటనలో సహజత్వమే అంత గొప్ప సక్సెస్ కు కారణమైంది. ప్రస్తుతం అతడి కెరీర్ పుల్ ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతు న్నాడు. డిఫరెంట్ జానర్ చిత్రాలతో పాటు కమర్శియల్ చిత్రాలతోనూ సత్తా చాటుతున్నాడు. గత రెండేళ్లగా రాజ్ కుమార్ రావు వెంట అన్నీ సక్సెస్ లే.
'స్త్రీ 2', 'విక్కీ విద్యా కా హూవాలా' రెండు బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన 'భూల్ చుక్ మాఫ్' కూడా మంచి విజయం సాధించింది. త్వరలో గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ `మాలిక్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సందీప్ మోడీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. అలాగే `టోస్టర్` అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు ఇదే ఏడాది రిలీజ్ అవుతాయి.
వీటితో పాటు కరణ్ జోహార్ వెంచర్ లోనూ మరో ప్రాజెక్ట్ కు సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. అయితే వరుస విజయాల నేపథ్యంలో రాజ్ కుమార్ రావు పారితోషికం భారీగా పెంచినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నారుట. లైనప్ లో ఉన్న చిత్రాలుకు అంతే మొత్తంలో తీసుకున్నాడుట. దీంతో రాజ్ కుమార్ రావ్ కెరీర్ లో ఇదే భారీ పారితోషికం అవుతుంది.
ఇంతవరకూ ఆయన ఏ సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ చేయలేదు. ఆరు నుంచి ఎనిమిది కోట్ల మధ్య లోనే అందుకునేవారు. అలాంటిది వరుస సక్సెస్ ల నేపథ్యంలో పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. అలాగే 'మాలిక్' చిత్రాన్ని ఓ ప్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నారుట. అది కొనసాగాలా? లేదా? అన్నది హిట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది.