రిలీజ్ సంగతి సరే టీజర్ మాత్రం పక్కానా?
దీనిపై సంగీత దర్శకుడు అనిరుద్ పని చేస్తున్నట్లు వినిపిస్తోంది. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది మరో సారి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప ఫిక్స్ చేయడానికి లేదు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగం `జైలర్` భారీ విజయం సాధించడం సహా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో? కోలీవుడ్ కి తొలి 1000 కోట్ల సినిమా గా `జైలర్ 2` రికార్డు సృష్టించడం ఖాయమంటూ అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో సినిమా రిలీజ్ ను రజనీ కాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ లో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించారు.
టీజర్ బర్త్ డేకి ఫిక్సేనా?
అయితే మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి ధృవీకరణ రాలేదు. దీంతో రిలీజ్ పై కాస్త సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. రజనీ ఇచ్చిన సమాచారం సరైంది కాదనే వార్తలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే షూటింగ్ ప్రారంభంకాక ముందే నిర్మాతలు ఒక ప్రకటన వీడియో రిలీజ్ చేశారు. `జైలర్ 2` టీజర్ రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న రిలీజ్ చేస్తామని ఆ వీడియోలో పేర్కొన్నారు. మరి టీజర్ చెప్పిన తేదీకి రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. కానీ సన్నిహితుల సమాచారం ప్రకారం టీజర్ పై వర్క్ జరుగుతుందని తెలిసింది.
అభిమానులెంతో ఆసక్తిగా:
దీనిపై సంగీత దర్శకుడు అనిరుద్ పని చేస్తున్నట్లు వినిపిస్తోంది. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది మరో సారి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప ఫిక్స్ చేయడానికి లేదు. ఈ సినిమా షూటింగ్ `కూలీ` సెట్స్ లో ఉన్నప్పుడే ప్రారంభమైంది. ఇది జరిగి కొన్ని నెలలు గడుస్తుంది. కానీ ఆ తర్వాత మళ్లీ సినిమాపై ఎలాంటి అప్ డేట్ రాలేదు. రజనీ కాంత్ గత సినిమా `కూలీ` అంచనాలు అందుకోవడంలో విఫలమైన నేపథ్యంలో? `జైలర్ 2` రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్లాప్ ని వీలైనంత త్వరగా హిట్ సినిమాతో భర్తీ చేయాలనే ఒత్తిడి కనిపిస్తోంది.
కొత్త ఏడాది లో కొత్త సినిమా:
కానీ దర్శకుడు నెల్సన్ ఎంత మాత్రం కంగారు పడకుండా పని చేస్తున్నాడు. రజనీ అభిమానులు అంచనాలకు మించే ఉంటుందంటూ గతంలోనే ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే స్టార్ నటుల్ని ఎంపిక చేసాడు. ఎస్. జె సూర్య, సురజ్ వెంజారాముదు, రమ్య కృష్ణ, యోగి బాబు, మిర్నా ముఖ్యమైన పాత్రల్లో కని పించనున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సహా ఆ నటులపై కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీంతో రజనీ పై షూటింగ్ దాదాపు ముగింపు దశకే చేరుకుంటుందని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే రజనీ కొత్త సినిమా మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.