రజనీ లాస్ట్ మూవీ అదేనా? లేక సర్ప్రైజ్ చేస్తారా?

అయితే వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నారని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Update: 2026-07-09 09:28 GMT

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ స్పెషల్ చాప్టర్ రాసుకున్న సూపర్‌ స్టార్ రజనీకాంత్ కెరీర్ లాస్ట్ స్టేజ్ కు చేరుకుందా? అంటే ప్రస్తుతం కోలీవుడ్‌ లో వినిపిస్తున్న చర్చలు చూస్తే అవుననే వినిపిస్తోంది. ఒకవైపు జైలర్ 2 రిలీజ్ కు రెడీ చేయగా.. ఇప్పుడు ధర్మన్ మూవీతో బిజీగా ఉన్నారు. అయితే అదే ఆయన చివరి సినిమా కావచ్చన్న ప్రచారం ఫ్యాన్స్ లో ఆసక్తితో పాటు ఆందోళనను కూడా కలిగిస్తోంది.

సాధారణ బస్ కండక్టర్‌ గా లైఫ్ స్టార్ట్ చేసిన రజనీ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హార్డ్ వర్క్ తో భారతీయ సినీ పరిశ్రమలో సూపర్‌ స్టార్‌ గా ఎదిగారు. 50 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఆయన ప్రస్తుతం 74 ఏళ్ల వయసులోనూ అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన కాల్షీట్ల కోసం ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతుండటం ఆయన క్రేజ్‌ కు బెస్ట్ ఎగ్జాంపుల్.

అయితే వయసు పెరుగుతున్న నేపథ్యంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో రజనీకాంత్ ఉన్నారని తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతకాలం తర్వాత పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని ఆయన భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రజనీకాంత్ నుంచి కానీ, ఆయన టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

ప్రస్తుతం రజినీకాంత్.. జైలర్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఆ చిత్రానికి నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, రజనీకాంత్ 173వ చిత్రానికి ధర్మన్ అనే టైటిల్‌ ను రీసెంట్ గా ప్రకటించారు. కమల్ హాసన్‌ కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించనున్నారు. విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌ లో ఆపరేషన్ థియేటర్‌ లో సర్జికల్ బ్లేడ్ చేతిలో పట్టుకుని రజనీకాంత్ కనిపించడం విశేషం. దీంతో సినిమాలో ఆయన డాక్టర్ పాత్రలో నటించనున్నారనే ప్రచారం మరింత బలపడింది.

అయితే ధర్మన్ నిజంగానే రజనీకాంత్ చివరి సినిమా అవుతుందా? లేక గతంలోలాగే రిటైర్మెంట్ వార్తలకు చెక్ పెట్టి మరోసారి కొత్త ప్రాజెక్టుతో అభిమానులను ఆశ్చర్యపరుస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా పలుమార్లు ఆయన రిటైర్మెంట్‌ పై ప్రచారం జరిగినప్పటికీ, ప్రతిసారి కొత్త సినిమాతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఈసారి కూడా అదే జరుగుతుందా? లేక నిజంగానే సూపర్‌ స్టార్ తన జర్నీకి ముగింపు పలుకుతారా? అన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News