వార్ 2, కూలీ.. డామినేషన్ లెక్కలేంటి..?
ఆగష్టు 14న బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి కూలీ ఇంకా వార్ 2 సినిమాలు.;
ఆగష్టు 14న బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి కూలీ ఇంకా వార్ 2 సినిమాలు. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమాగా వార్ 2 పై హ్యూజ్ బజ్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటిన తారక్ ఆ నెక్స్ట్ దేవరతో కూడా ఆడియన్స్ ని పలకరించాడు. ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేసిన మేడిన్ ప్రాజెక్ట్ గా వార్ 2 పై ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా తమ బెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఐతే దీనికి ఏమాత్రం తగ్గకుండా కూలీ సినిమా వస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మన కింగ్ నాగార్జున విలన్ గా కూలీ వస్తుంది. కూలీ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూడా నటించారు. ఐతే ఒకేరోజు రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది.
పోటీ మాట అటుంచితే కూలీ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. తమిళ్ లో ఆల్రెడీ పెద్ద ఈవెంట్ నిర్వహించారు. రీసెంట్ గా తెలుగులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్ తెలుగులోనే ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రమోషన్స్ వల్ల కూలీ సినిమా కాస్త ఎక్కువ బజ్ ఏర్పరచుకుంది.
సౌత్ లో రజినీకాంత్ సినిమాకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అందులోనూ లోకేష్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేసిన సినిమా అవ్వడం వల్ల అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కూలీ సినిమాలో రజినితో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉండటంపై ఆడియన్స్ ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారు.
వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ ఉన్నా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. ఐతే నార్త్ లో కూలీ కన్నా వార్ 2 కే ఎక్కువ బజ్ ఉంది. ఆల్రెడీ వాళ్లు వార్ 2 బుకింగ్స్ ఓపెన్ కాగా ఫ్యాన్స్ బుక్ చేసుకుంటున్నారట.వార్ 2, కూలీ ఈ రెండు సినిమాలకు మొదటి టాక్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ముందు ఏ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే దానికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది.
వార్ 2, కూలీ రెండు సినిమాల్లో మరో కామన్ పాయింట్. రెండు కూడా మల్టీస్టారర్స్ గా వస్తున్నాయి. అఫ్కోర్స్ వార్ 2 లో ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరే నటించారు. కానీ కూలీలో రజినీకాంత్ తో పాటు మరో ముగ్గురు స్టార్స్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా ఉన్నారు.కూలీకి తెలుగులో ఆల్రెడీ ప్రమోషన్స్ మొదలు పెట్టగా వార్ 2 కి ఇంకా ప్రమోషన్స్ షురూ చేయలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మంచి ప్రమోషన్స్ ఆశిస్తున్నారు.
ఇక రెండు సినిమాల ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూస్తే అటు రజనీ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ కూలీ కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో వార్ 2 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. ఐతే ఈ రెండు సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదవుతుంది అన్నది డిస్కషన్ నడుస్తుంది. మన ఆడియన్స్ రెండు సినిమాల మీద ఆసక్తిగా ఉన్నారు. సో వార్ 2 మొదటి షో చూసి అదే రోజు ఈవెనింగ్ కూలీ చూసినా చూస్తారు.. లేదు కూలీ ముందు చూసి ఆ తర్వాత వార్ 2 చూస్తారు.
ప్రమోషన్స్ వైజ్ చూస్తే కూలీ దూకుడు మీద ఉంటే.. వార్ 2 ఇంకా సరైన ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. వార్ 2 తెలుగు రెండు రాష్ట్రాల్లో సితార నాగ వంశీ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ ప్లానింగ్ ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. విజయవాడలో ఒక భారీ ఈవెంట్ వార్ 2 కోసం అనుకున్నారట ఎన్ టీ ఆర్, హృతిక్ రోషన్ ఆ ఈవెంట్ కి వచ్చే ప్లానింగ్ ఉందట. బట్ అది కూడా కరెక్ట్ న్యూస్ కాదు అని తెలుస్తుంది.
కూలీ సినిమా డైరెక్టర్ లోకేష్ మీద ఆడియన్స్ అంచనాలు బాగున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా కూడా కూలీపై ఆడియన్స్ ఆస్క్తి ఉంటుంది.కూలీ కి నార్త్ లో మాస్ ఆడియన్స్ క్రేజ్ కూడా యాడ్ అవుతుంది. వార్ 2 కి సౌత్ లో యాక్షన్ ప్రియుల నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇలా రెండు సినిమాలు వాటి మధ్య ఎందులోనూ తగ్గని వార్ ఫిక్స్ అయ్యేలా ఉంది.