నెల్స‌న్ ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకోగ‌ల‌డా?

లోక నాయకుడు క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వీరిద్ద‌రూ ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్నారు.;

Update: 2026-01-30 08:28 GMT

లోక నాయకుడు క‌మ‌ల్ హాస‌న్, సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ వీరిద్ద‌రూ ఎన్నో ఏళ్ల నుంచి కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. మ‌ధ్య‌లో కొన్ని ప్ర‌యోగాలు చేసి క‌మ‌ల్ రేసులో వెనుక‌బ‌డ్డారు కానీ రజినీకాంత్ మాత్రం త‌న సినిమాల‌ను కోలీవుడ్ కు మాత్ర‌మే కాకుండా దేశ‌వ్యాప్తంగా, ఓవ‌ర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ను ఏర్ప‌ర‌చుకోగ‌లిగారు.

క‌మ‌ల్, ర‌జినీ కాంబినేష‌న్ కు భారీ క్రేజ్

అలా అని క‌మ‌ల్ త‌క్కువేమీ కాదు, ఎన్ని ఫ్లాపులొచ్చినా, స‌రైన సినిమా ఒక‌టి ప‌డితే చాలు, త‌న సినిమాకు విప‌రీత‌మైన క‌లెక్ష‌న్లు వ‌చ్చేలా చేసేవారు. ఈ ఇద్ద‌రికీ కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో వీరిద్ద‌రూ క‌లిసి చాలా సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. క‌మ‌ల్ హీరోగా చేస్తే, ర‌జినీ విల‌న్ గా చేసేవారు. అలా వీరిద్ద‌రి కాంబినేష‌న్ కు ఎంతో మంచి క్రేజ్ ఉండేది.

గ‌తంలో ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన ర‌జినీ, క‌మ‌ల్

కానీ క‌మ‌ల్, ర‌జ‌నీ ఎవ‌రికి వారు స్టార్లు అయ్యాక మాత్రం వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రూ క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తే బావుంటుంద‌ని ఎప్ప‌ట్నుంచో మూవీ ల‌వ‌ర్స్ కోరుకుంటున్నారు. అయితే మొన్నా మ‌ధ్య వీరి కాంబినేష‌న్ లో సినిమా రాబోతుంద‌ని వార్త‌లొచ్చాయి. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్, అట్లీ, లోకేష్ క‌న‌గరాజ్ లాంటి ప‌లువురు డైరెక్ట‌ర్లు ఈ స్టార్ హీరోల‌కు క‌థ‌ల‌ను కూడా చెప్పార‌ని వార్త‌లొచ్చాయి.

నెల్స‌న్ చేతికి వెళ్లిన ఆఫ‌ర్

వార్త‌లైతే వ‌చ్చాయి కానీ ఆ ప్రాజెక్టు మాత్రం ముందుకు క‌ద‌ల్లేదు. మొన్నామ‌ధ్య కూలీ సినిమా రిలీజ్ కు ముందు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీని డైరెక్ట్ చేస్తార‌న్నారు కానీ కూలీ రిజ‌ల్ట్ త‌ర్వాత ఆయ‌న పేరు వినిపించ‌లేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలున్నాయ‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

త్వ‌ర‌లోనే అనౌన్స్‌మెంట్ ప్రోమో షూట్

ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రోమోను కూడా నెక్ట్స్ వీక్ షూట్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. జైల‌ర్2 అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై అంచ‌నాలను విప‌రీతంగా పెంచేసిన నెల్స‌న్ ఇప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్టు ఏ రేంజ్ లో అనౌన్స్ చేయ‌నున్నారో అని అంద‌రూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ప్రాజెక్టు ఇప్పుడు అనౌన్స్ చేసినా ఎవ‌రికి వారే నెల్స‌న్, క‌మ‌ల్, ర‌జినీ త‌మ త‌మ క‌మిట్‌మెంట్స్ తో బిజీగా ఉండ‌టంతో అవ‌న్నీ పూర్త‌య్యాకే ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు. ఒక‌వేళ ర‌జినీతో నెల్స‌న్ చేస్తున్న జైల‌ర్2 రిజ‌ల్ట్ ఏమైనా తేడా కొడితే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లే అవ‌కాశం కూడా త‌గ్గిపోతుంది. అందుకే వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని జైల‌ర్ 2ను నెల్స‌న్ చాలా జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి నెల్స‌న్ ఈ అవ‌కాశాన్ని అందుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News