రజని కమల్ మూవీ.. రేసులో యంగ్ డైరెక్టర్..?

సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందన్న న్యూస్ తెలిసిందే.;

Update: 2025-09-21 14:30 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందన్న న్యూస్ తెలిసిందే. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్ కలిసి చేసే సినిమా కాబట్టి ఆ ప్రాజెక్ట్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. కెరీర్ మొదట్లో రజనీ, కమల్ హాసన్ కలిసి సినిమాలు చేశారు. ఇద్దరు కూడా సూపర్ స్టార్స్ అయ్యాక కలిసి పనిచేసే అవకాశం రాలేదు. ఐతే రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ సినిమా చేయాలని అనుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఈమధ్యనే కూలీ సినిమాతో వచ్చిన లోకేష్ సినిమాను అంచనాలను అందుకోలేదు.

లోకేష్ డైరెక్షన్ లో అనుకున్న ప్రాజెక్ట్..

లోకేష్ డైరెక్షన్ లో ఉంటుందనుకున్న కమల్, రజనీ మూవీ కూడా ఆయన డైరెక్షన్ నుంచి చేజారినట్టు టాక్. ఐతే కమల్, రజనీ ఇద్దరి పెద్ద స్టార్స్ ఈ ఇద్దరిని హ్యాండిల్ చేయగల స్టార్ డైరెక్టర్ ఎవరా అన్న డిస్కషన్ కోలీవుడ్ లో నడుస్తుంది. ఐతే ఈ స్టార్స్ ఇద్దరిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక యువ డైరెక్టర్ అందుకున్నాడని తెలుస్తుంది. రజనీ, కమల్ కాంబినేషన్ సినిమాను హీరో కం డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ డైరెక్ట్ చేస్తున్నాడట.

అఫీషియల్ గా చెప్పలేదు కానీ దాదాపు ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కే ఆ ఛాన్స్ వచ్చిందట. డైరెక్టర్ గా కోమలి సినిమాతో హిట్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఆ నెక్స్ట్ లవ్ టుడే సినిమా చేశాడు. ఐతే ఆ సినిమాలో మరెవరో హీరో ఎందుకని తనే హీరోగా నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక లవ్ టుడే క్రేజ్ తో డ్రాగన్ ఛాన్స్ అందుకున్నాడు. ఐతే డ్రాగన్ తర్వాత ఎల్.ఐ.జె, డ్యూడ్ అనే సినిమాలు చేస్తున్నాడు.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న..

ఈ రెండు సినిమాలు యూత్ టార్గెట్ తోనే వస్తున్నాయి. ఇలా హీరోగా సూపర్ ఫాం లో ఉన్న ప్రదీప్ కి కమల్, రజనీ మూవీ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. అదే నిజమైతే మాత్రం ప్రదీప్ రేంజ్ మారినట్టే లెక్క. ఇప్పటికే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్. రాబోతున్న సినిమాలు కూడా సూపర్ డిమాండ్ తో వస్తున్నాయి. ఈ టైంలో రజనీ, కమల్ మూవీ డైరెక్షన్ ఛాన్స్ కూడా వస్తే మాత్రం అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

వాళ్ల అనుభవం అంత వయసు ఇతనికి లేకపోవచ్చు కానీ వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగాడు కాబట్టి ఆ సినిమాను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి రజనీ స్టైల్ ని.. కమల్ అభినయాన్ని చూపిస్తే మాత్రం కచ్చితంగా ప్రదీప్ రంగనాథన్ పేరు కొన్నాళ్లుగా గుర్తుండిపోతుంది. మరి నిజంగానే యువ దర్శకుడికి ఆ ఛాన్స్ వచ్చిందా లేదా అన్న క్లారిటీ త్వరలో తెలుస్తుంది.

Tags:    

Similar News