'జైలర్' సీక్వెలా? ప్రీక్వెలా?
కానీ తాజాగా మోహన్ లాల్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కొత్తగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కామి యో పాత్రకు ఎంపికయ్యారు.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. రజనీకాంత్ సహా ప్రధాన పాత్రలపై కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసారు. అయితే ఈ సినిమా జైలర్ కి సీక్వెల్ అనే ఇంతవరకూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటి భాగంలో కొన్ని పాత్రలు ఎగ్జిట్ అవ్వడం...వాళ్ల స్థానాలను మరో నటులతో భర్తీ చేసినట్లు ప్రచారం జరిగింది. అదనంగా కొత్త స్టార్లు కూడా యాడ్ అయ్యారు. ఎస్. జె సూర్య, మిథున్ చక్రవర్తి కొత్తగా ఎంటర్ అయ్యారు.
వర్త్ వర్మ మళ్లీ దిగాడు:
కానీ తాజా సన్నివేశం చూస్తుంటే `జైలర్` కి సీక్వెల్ కాదు..ప్రీక్వెల్లా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా మలయాళ నటుడు వినాయకన్ మళ్లీ ఎంటర్ అవ్వడంతో ఆ డౌట్ రెయిజ్ అయింది. `జైలర్` క్లైమాక్స్ లో వినాయకన్ నటించిన ( వర్మ) పాత్ర చనిపోతుంది. ఒకవేళ సీక్వెల్ అయితే గనుక చనిపోయిన పాత్ర కొనసాగదు. ప్రీక్వెల్ అయితే ఆ ఛాన్స్ కనిపిస్తుంది. వర్మ పాత్ర గతాన్ని ఇంకా లోతుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే జైలర్ లో నటించిన మోహన్ లాల్ పేరు తొలుత ప్రచారంలోకి వచ్చినా? రెండవ భాగంలో ఆయన నటించడం లేదన్న వార్తలు వేడెక్కించాయి.
కొత్త పాత్ర? రీప్లేస్ చేస్తున్నారా:
కానీ తాజాగా మోహన్ లాల్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. కొత్తగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కామి యో పాత్రకు ఎంపికయ్యారు. బాలయ్య నో చెప్పడంతో అతడి స్థానంలో సేతుపతిని తీసుకున్నారా? ఇది కొత్త పాత్ర? అన్నది క్లారిటీ లేదు. శివ రాజ్ కుమార్ కూడా షూట్ లో జాయిన్ అవుతున్నాడు. అలాగే రజనీ గత జీవితాన్ని ఈ కథలో చెప్పబోతున్నారు అన్నది మరో ఆసక్తిర విషయం. దీంతో `జైలర్` కి ప్రీక్వెల్ అన్న సందేహాలు బలపడు తున్నాయి. మరి ఈ ప్రచారంలో వాస్తవాలు తెలియాల్సి ఉంది. సినిమా మొదలైన నటి నుంచి నెల్సన్ పెద్దగా అప్ డేట్స్ కూడా ఇవ్వలేదు.
రిలీజ్ తేదీ ఇదేనా:
షూటింగ్ విషయాలు కూడా గొప్యంగా ఉంచుతున్నారు. ఓ సందర్భంలో రజనీకాంత్ రిలీజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ చేస్తామన్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజనీకి సరైన సమాచారం లేకుండా అలాంటి ప్రకటన చేసారని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ఏంటంటే జూన్ 12న చిత్రం రిలీజ్ చేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కొత్త కథనాలు ఊపందు కున్నాయి. మరి ఇప్పటికైనా మేకర్స్ అసలు రిలీజ్ వివరాలు వెల్లడిస్తారేమో చూడాలి.