కూలీ వల్ల కాలేదు.. జైలర్-2 సాధిస్తుందా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-08-17 06:04 GMT

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ అందుకుంది.

అయితే కూలీ మూవీపై రిలీజ్ కు ముందు ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ యమా స్పీడ్ లో జరిగాయి. దీంతో మూవీ కచ్చితంగా కోలీవుడ్ డ్రీమ్ మార్క్ ను సాధిస్తుందని అంతా అంచనా వేశారు. రూ.1000 కోట్లు సాధిస్తుందని ఊహించారు.

కానీ సినిమా విడుదలయ్యాక సీన్ రివర్స్ అయింది. హైప్ కు తగ్గట్టు రిజల్ట్ రాలేదని చెప్పాలి. మిశ్రమ స్పందన వస్తోంది. అయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా రూ.151 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన కోలీవుడ్ మూవీగా సరికొత్త చరిత్ర సృష్టించింది.

అయితే పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మాత్రం.. కూలీ మూవీ రూ.1000 కోట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్లేదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అవకాశం లేదని చెబుతున్నారు అదే సమయంలో ఇప్పుడు రజినీకాంత్ లైనప్ లో ఉన్న జైలర్ సీక్వెల్ మూవీకి ఆ సామర్థ్యం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే జైలర్ మూవీతో రజినీ ఎలాంటి హిట్ అందుకున్నారో తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమా వేరే లెవెల్ లో అలరించగా.. తలైవా కెరీర్ లో జైలర్ చిత్రం ఓ బెస్ట్ స్టెప్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఓ రేంజ్ లో దూసుకుపోయింది.

దీంతో జైలర్-2పై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరోలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే రజినీకాంత్ భారీ బ్రాండ్ వాల్యూ, ఫస్ట్ పార్ట్ హిట్ కారణంగా జైలర్ 2 సులభంగా రూ.1000 కోట్లు సాధించగలదని అంతా ఊహిస్తున్నారు. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఉన్నారు. మరి జైలర్ 2 కోలీవుడ్ డ్రీమ్ ను తీర్చగలుగుతుందో లేదో.. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News