కూలీ బాక్సాఫీస్: రెండో రోజు లెక్క ఎంతవరకు వెళ్లిందంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.;
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. తలైవర్ మాస్ ఎంటర్‌టైనర్‌గా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ డే నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్ వంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. కానీ కంటెంట్ పరంగా మాత్రం సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక బాక్సాఫీస్ వద్ద రెండవ రోజు పరిస్థితి ఎలా ఉందంటే..
ఈ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డ్ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ కలిసి 43 కోట్లకు హక్కులను తీసుకున్నట్లు టాక్. తమిళనాడు రైట్స్ దాదాపు 100 కోట్లు, కర్ణాటక కేరళ 20 కోట్లు, నార్త్ ఇండియా 50 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 85 కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. మొత్తం మీద వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 310 కోట్లకు చేరింది.
మొదటి రోజు కలెక్షన్స్
రిలీజ్ రోజే కూలీ అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ట్రేడ్ టాక్ ప్రకారం, డే 1లో వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా తమిళనాడులోనే 40 కోట్లకు పైగా వచ్చిందని, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి రెస్పాన్స్ దక్కిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లోనూ రజనీ క్రేజ్ స్పష్టంగా కనిపించింది.
2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
టాక్ ఎలా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లు రెండింటిలోనూ మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. రెండో రోజు కూడా మంచి హోల్డ్‌తో కొనసాగిన ఈ సినిమా, హాలిడే వాతావరణం కారణంగా బలమైన షోలు నమోదు చేసుకుంది. డే 2లో సుమారు రూ.13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని అంచనాలు ఉన్నాయి.
ఇతర రాష్ట్రాలు - ప్రపంచవ్యాప్తంగా
తమిళనాడులో రెండో రోజూ భారీ రెస్పాన్స్ దక్కింది. దాదాపు రూ.34 కోట్లకు పైగా రాబట్టినట్లు టాక్. హిందీ మార్కెట్‌లో సుమారు రూ.7 కోట్ల గ్రాస్ సాధించిందని సమాచారం. కర్ణాటక, కేరళ, రెస్టాఫ్ ఇండియాలో కూడా బజ్ కారణంగా మంచి కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు బలంగా కొనసాగుతున్నాయి.
ట్రేడ్ టాక్ ప్రకారం, కూలీ రెండో రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు రూ.88 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీంతో రెండు రోజులకు మొత్తం కలెక్షన్లు దాదాపు రూ.243 కోట్లకు చేరాయని టాక్.
అంచనాల ప్రకారం రెండో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్
తమిళనాడు - రూ.34.18 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - రూ.13.38 కోట్లు
హిందీ - రూ.7.43 కోట్లు
కన్నడ - రూ.0.54 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ (డే 2) - రూ.88 కోట్లు+
2 రోజులు కలిపి - రూ.243 కోట్లు+ (గ్రాస్, అంచనా)