కూలీ.. ఇదేమి బాక్సాఫీస్ ను డ్యామేజ్ చేయదుగా?

ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో కూలీ సినిమాకు రోజురోజుకు హైప్ మరింత పెరుగుతోంది.;

Update: 2025-06-25 04:28 GMT

ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్టుల్లో కూలీ సినిమాకు రోజురోజుకు హైప్ మరింత పెరుగుతోంది. రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అన్ని భాషల్లో కూడా కమర్షియల్ గా డిమాండ్ గట్టిగానే ఉంటుందని అనుకున్నారు. తలైవా మాస్ స్టైల్స్‌కు, లోకేష్ డైరెక్షన్ టేకింగ్‌కు, అనిరుధ్ సంగీతానికి ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు స్పెషల రోల్స్ కూడా మరింత బూస్ట్ ఇస్తున్నాయి.

ఇందులో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు లోకేష్ అన్ని భాషల్లో సినిమాకు హైప్ వచ్చేలా తీసుకున్న జాగ్రత్తలు దాదాపు బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ఒక్క దగ్గర మాత్రం కూలీ బజ్ ఇబ్బంది పెడుతున్నట్లు అనిపిస్తోంది. మంచి భారీ హైప్ మధ్య, సినిమాకు సంబంధించిన ఒక నిర్ణయం మైనస్ వైబ్ తీసుకొచ్చింది.

అది హిందీలో టైటిల్ మార్పు. కూలీ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ని బదులు, హిందీలో మజ్దూర్గా మార్చారు. ఈ పేరు పట్ల నార్త్ ఆడియెన్స్‌లో మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. మజ్దూర్ అన్న పదం ఓ క్లాస్ టోన్‌లో ఉండటంతో, రజనీ మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్ కావడం కష్టం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమీర్ ఖాన్ తో క్రేజ్ ను బ్యాలెన్స్ చేయవచ్చు అనుకున్నప్పటికి టైటిల్ కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చింది.

ఈ టైటిల్ 1950ల నాటి ఫీలింగ్‌ని తీసుకువస్తుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ మార్పుకు కారణం కాపీ రైట్స్ సమస్యే అని బలమైన ఊహాగానాలు ఉన్నాయి. 1983లో అమితాబ్ బచ్చన్ నటించిన లెజెండరీ హిట్ కూలీ టైటిల్ రైట్స్ ఇప్పటికీ ఆ నిర్మాత వద్దే ఉన్నాయని సమాచారం. ఆ టైటిల్ రీ యూజ్ చేయాలంటే క్లియర్ పరమిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అదే సమస్య ఎదురవడంతో హిందీ వెర్షన్‌కి మజ్దూర్ అని పేరు పెట్టారని ఇన్ సైడ్ టాక్.

ఇదంతా జరుగుతున్న టైంలో, కూలీకి ఎదురుగా జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 కూడా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. నార్త్ మార్కెట్‌లో థియేటర్లు సంపాదించాలంటే టైటిల్, ప్రమోషన్ల స్థాయిలు కూడా కీలకం. అలాంటి సమయంలో ఇలా పేరు మార్చడంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అయినా కానీ, లోకేష్ స్టైల్, రజనీకాంత్ పవర్ స్క్రీన్ మీద దంచికొడితే.. ఓపెనింగ్స్ గ్యారెంటీ అని అభిమానులు నమ్ముతున్నారు.

టీజర్ ఇప్పటికే భారీ అంచనాల్ని పెంచింది. పూర్తి ట్రైలర్ వచ్చాక అసలైన కిక్ అందుతుందనడంలో సందేహమే లేదు. అయితే తమిళ సినిమాలకు అందని ద్రాక్షగా మిగిలిన 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలి అంటే హిందీ మార్కెట్ చాలా కీలకం. కొంత ఎఫెక్ట్ పడినా కూడా అది కష్టమే. మరి కూలీ ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News