జక్కన్న - శేఖర్‌ కమ్ముల మధ్య తేడా ఇదే

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ తాను వర్క్ చేసిన దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.;

Update: 2025-04-02 12:30 GMT

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజీవ్‌ కనకాల. ఇటీవల ఈయన పోషించిన పాత్రలకు మంచి స్పందన వస్తున్న విషయం తెల్సిందే. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఎప్పుడూ బిజీగా సినిమాలు చేస్తూ, సిరీస్‌లో నటిస్తున్న రాజీవ్‌ కనకాల తాజాగా 'హోం టౌన్‌' అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆహాలో ఈ వారంలోనే స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రాజీవ్‌ కనకాల కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సిరీస్‌ను #90's బయోపిక్‌ మేకర్స్‌ నిర్మించడంతో ఇండస్ట్రీ వర్గాల్లో, ఓటీటీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు, ఆసక్తి కనిపిస్తోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సిరీస్‌ ఉంటుంది అంటూ తాజాగా రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ తాను వర్క్ చేసిన దర్శకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజమౌళి తనకు కావాల్సింది వచ్చే వరకు వదిలి పెట్టడు. ఎక్కువ సమయం అయితే అరిచి మరీ తనకు కావాల్సింది వచ్చేలా చేసుకుంటాడు. కానీ శేఖర్ కమ్ముల అలా కాదు. ఆయన కూడా తనకు కావాల్సింది వచ్చే వరకు వదిలి పెట్టడు. కానీ ఆయన ఎదుటి వారిపై అరవకుండా తనకు కావల్సింది కూల్‌గా వచ్చేలా చేసుకుంటాడు. రిక్వెస్ట్‌గా, తన జుట్టు తాను పీక్కుంటూ ఇంకొక్క సారి చేద్దాం, అలా కాదు, ఇలా కాదు అంటూ శేఖర్ కమ్ముల తన నటీ నటులతో కావాల్సింది వచ్చేలా చేసుకుంటాడు.

సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. స్క్రిప్ట్‌లో ఉన్నట్లుగా కాకుండా ముందు మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి. సీన్ చెప్పి నటించమని అంటారు. అది బాగుంటే తీసుకుంటారు... లేదంటే అందులో ఆయనకు నచ్చినంత వరకు ఉంచి మళ్లీ షూట్‌ చేసుకుంటారు. ఆయన మేకింగ్‌ స్టైల్‌ చాలా విభిన్నంగా ఉంటుంది అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. స్క్రిప్ట్‌లో ఉన్నది ఉన్నట్లుగా చేయాలని ఆయన అనుకోరు. సందర్భానుసారంగా మార్చినా పర్వాలేదు. సీన్‌ బాగా రావాలని అనుకుంటారు. ఎదుటి వారు ఏం చేసినా నిరాశ పరచకుండా బాగుంది అంటారు. ఇంకాస్త బెటర్‌గా చేస్తే బాగుంటుంది అంటారు. ఆయన మాటలతో ప్రతి ఒక్కరి కాన్ఫిడెన్స్‌ పెరుగుతుంది అన్నారు.

తాజాగా ఆయన నటించిన హోం టౌన్‌ యూత్‌ ఆడియన్స్‌కు నచ్చే విధంగా ఉంటుందని, ఈ సిరీస్‌లోని తన పాత్ర విభిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. #90's బయోపిక్‌కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్కరిని టచ్‌ చేసే విధంగా ఈ సిరీస్ ఉంటుందని, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌లో ప్రజ్వల్‌, ఆనీ ఇంకా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విభిన్నమైన ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్‌ సిరీస్ సాగుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News