పవన్ కోసం రంగంలోకి జక్కన్నని దించేస్తున్నారా?
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు`. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది;
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా పీరియాడిక్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు`. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. 17వ శతాబ్దం నాటి ఓ వీరుడి కథగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించారు. మొఘల్ కాలం నాటి రాబిన్ హుడ్ లాంటి ఓ యోధుడిగా ఇందులో పవన్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే గత కొంత కాలంగా ఈ మూవీ రిలీజ్ మాత్రం నాన్నా పులిలా వాయిదా పడుతూ ఫ్యాన్స్‌ని కలవరానికి గురి చేసింది.
వరుస వాయిదాల అనంతరం టీమ్ ఫైనల్‌గా ఈ మూవీని జూలై 24న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ చేసింది. దీని కోసం ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పరంగా స్పీడు పెంచారు. త్వరలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
భారీ స్థాయిలో నిర్వహించబోతున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం జక్కన్నని రంగంలోకి దించేస్తున్నారట. ఇప్పటికే ఆయనని టీమ్ సంప్రదించడం, రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచక జరిగిపోయాయిని తెలిసింది. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉంటున్న పవన్ సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అంతే కాకుండా ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయలేదు. తను నటించిన తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు` కావడంతో ఈ మూవీపై అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
వరుస వాయిదాల కారణంగా కొంత క్రేజ్ తగ్గినా ఇటీవల ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక వరుసగా రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి `హరి హర వీరమల్లు`పై పడింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళిని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆహ్వానించి సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే జక్కన్న హరి హర వీరమల్లు`పై ప్రశంసల వర్షం కురిపించి సినిమాపై మరింత క్రేజ్‌ని పెంచే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్. ఇదే ఈవెంట్‌లో పవన్ ఆత్మగా పేరున్న త్రివిక్రమ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది.