మహేష్ కోసం రూల్స్ బ్రేక్ చేస్తున్న జక్కన్న
నవంబర్ 15న భారీ కర్టెన్ రైజర్ ఈవెంట్ ప్లాన్ చేయడం, సినిమాకు సంబంధించిన హడావుడిని కంటిన్యూస్‌గా మెయింటైన్ చేస్తుండటం చూస్తుంటే, ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి.;
ఒక సినిమాను చెక్కాలంటే జక్కన్నకు ఏళ్లు కావాలి. ప్రతీ ఫ్రేమ్‌ను ఒక శిల్పంలా మలుస్తాడు. అందుకే ఆయన సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తారు. కానీ ఈసారి ఆ జక్కన్న శైలిలో ఏదో తెలియని వేగం కనిపిస్తోంది. ఇది చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. సహజంగా సినిమా మొదలయ్యాక అప్‌డేట్స్ ఇవ్వడానికి ఏళ్లకు ఏళ్లు సమయం తీసుకునే రాజమౌళి.. ఈసారి మాత్రం దూకుడు మీదున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న గ్లోబల్ ప్రాజెక్ట్ (SSMB29) విషయంలో ఆయన ప్లానింగ్ షాకిస్తోంది. వరుస అప్‌డేట్లు, పోస్టర్లు అంటూ హోరెత్తిస్తున్నారు. నిజానికి, రాజమౌళి సినిమా అంటే 2027 చివరి వరకు రాదని అందరూ ఫిక్స్ అయిపోయారు. 'బాహుబలి', 'RRR' సినిమాల అనుభవం అదే చెబుతోంది. కానీ 'SSMB29' విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది.
నవంబర్ 15న భారీ కర్టెన్ రైజర్ ఈవెంట్ ప్లాన్ చేయడం, సినిమాకు సంబంధించిన హడావుడిని కంటిన్యూస్‌గా మెయింటైన్ చేస్తుండటం చూస్తుంటే, ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తున్నాయి. ఈ స్పీడ్‌కు కారణం మహేష్ బాబేనని గట్టిగా టాక్ వినిపిస్తోంది. మహేష్ ఎప్పుడూ తక్కువ టైమ్‌లో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇష్టపడతారు. ఆయన కోసమే జక్కన్న తన పంథా మార్చుకున్నారని అంటున్నారు.
ఈ లెక్కన సినిమా 2027 చివర్లో కాకుండా, 2027 ప్రారంభంలోనే థియేటర్లలోకి వచ్చేయొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. చిత్ర యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, షూటింగ్ పార్ట్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. ఈ సినిమాకు ఆలస్యం అయ్యే ఏకైక అంశం భారీ వీఎఫ్‌ఎక్స్ పనులు మాత్రమే. వాటిని పక్కన పెడితే, మిగతా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయట.
'గ్లోబ్‌ట్రాటర్' లేదా 'వారణాసి' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు, అభిమానుల ఆకలి తీర్చడానికి రాజమౌళి ఏకంగా మూడు నిమిషాల టీజర్‌ను సిద్ధం చేస్తున్నారని కూడా సమాచారం. ఇదే కనుక నిజమైతే, జక్కన్న-మహేష్ బాబు సృష్టించబోయే ఆ గ్లోబల్ అడ్వెంచర్ విజన్ ఎలా ఉండబోతుందో ముందే చూసేయొచ్చు. ఈ స్పీడ్ చూస్తుంటే, ఫ్యాన్స్ వెయిటింగ్‌కు త్వరగానే తెరపడేలా ఉంది.