రాజమౌళి 'మేడ్ ఇన్ ఇండియా' డౌటే లేదా!
అయితే అప్పుడే ఈ చిత్రానికి రాజ మౌళి కేవలం నిర్మాత మాత్రమేనని చెప్పారు. దర్శకుడు వివరాలు గానీ...ఇతర ఏ విషయాలు రివీల్ చేయలేదు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ని రాజమౌళి నిర్మి స్తున్నట్లు ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో తెలిసిందే. అటుపై కొన్ని గంటలకే ఎలాంటి బయోపిక్ నిర్మించ లేదని ఆ బాద్యత తీసుకుంది అమీర్ ఖాన్ అని తేలిపోయింది. దీంతో రాజమౌళికి- ఫాల్కే జీవితానికి ఏ సంబంధం లేదని అర్దమైపోయింది. మరి ఈ ప్రచారం ఎలా పురుడు పోసుకుంది.
మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం బలంగా ఏ కారణంతో ముందుకొచ్చిందంటే? అసలు కారణం ఇదని తెలు స్తోంది. ఇండియన్ సినిమా గొప్పతనం గురించి రాజమౌళి ఓ సినిమా తీయాలనుకున్న మాట వాస్తవం. ఏడాది క్రితమే దీనికి సంబం ధించి అధికారికంగా ప్రకటన ఇచ్చారు. అయితే అప్పుడే ఈ చిత్రానికి రాజ మౌళి కేవలం నిర్మాత మాత్రమేనని చెప్పారు. దర్శకుడు వివరాలు గానీ...ఇతర ఏ విషయాలు రివీల్ చేయలేదు.
దీంతో ఈ విషయాన్ని అంతా మర్చిపోయారు. కానీ ఒక్కసారిగా రాజమౌళి ఫాల్కే అంశం తెరపైకి రావ డంతో? గత ఏడాది ప్రకటించిన 'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్ నే ఫాల్కే కథగా మీడియా ఫోకస్ చేసింది. భారతీయ సినిమా చరిత్ర అంటున్నారు కాబట్టి కచ్చితంగా అందులో ఫాల్కే ప్రస్తావన ఉంటుంది. ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ పేరును పరిశీలించి ఉండొచ్చు. తన కథలో ఫాల్కే అన్నది కేవలం ఓ పాత్ర మాత్రమే అయిండొచ్చు.
తారక్ కంటే ముందే రాజమౌళి మరికొంత మంది నటుల పేర్లు కూడా పరిశీలించి ఉండొచ్చు. కానీ రాజమౌళి దృష్టిలో తారక్ గొప్ప నటుడిగా ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే అతడి పేరు బలంగా వినిపిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తే గనుక అది భారత్ గర్వించేలా ఉంటుందని ఓ సీనియర్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.