కాలకేయ కోసం కొత్త భాషే సృష్టించారు! కిలికిలి స్టోరీ వెనుక అసలు స్టోరీ!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’.

Update: 2026-08-12 16:30 GMT

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’. ఈ సినిమాలో నటీనటుల నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతగా ఆకట్టుకున్నాయో.. కాలకేయ తెగ మాట్లాడిన ఆ విచిత్రమైన భాష కూడా అంతే సంచలనం సృష్టించింది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆ భాషను అనుకరించకుండా ఉండలేకపోయారు. ఇంతకీ ఆ 'కిలికిలి' భాష ఎలా పుట్టిందో, దాని వెనుక ఉన్న ఆసక్తికర కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాజమౌళి వినూత్న ఆలోచన:

‘బాహుబలి’ సినిమాలో కాలకేయ తెగ క్రూరత్వాన్ని చూపించేందుకు ఏ ప్రాచీన భారతీయ భాష వాడినా సరిపోదని దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి భావించారు. పైగా ఏ నిజ జీవిత భాషనైనా వాడితే ఎవరి భావోద్వేగాలైనా దెబ్బతింటాయేమోనని భయపడ్డారు. అందుకే ఆ తెగ కోసం పూర్తిగా ఒక కొత్త కల్పిత భాషను రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

సృష్టికర్త మదన్ కార్కీ :

ఈ విచిత్రమైన భాషను సృష్టించిన ఘనత తమిళ ప్రఖ్యాత రచయిత వైరముత్తు కుమారుడు, గ్రీట్ రచయిత మదన్ కార్కీకే దక్కుతుంది. బాహుబలి తమిళ వెర్షన్ డైలాగ్స్ రాస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన రాగా, రాజమౌళి వెంటనే ఓకే చెప్పారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'కిలికి' భాష.

నోటికొచ్చిన కూత కాదు.. పక్కా వ్యాకరణం:

చాలామంది ఇది కేవలం నోటికొచ్చినట్లు అరిచిన కేకలు అనుకుంటారు. కానీ అది నిజం కాదు! ఈ భాషలో దాదాపు 3,000 పైగా పదాలు, 22 అక్షరాలు/గుర్తులు మరియు 40కి పైగా బలమైన వ్యాకరణ సూత్రాలు ఉన్నాయి. ఇక ప్రపంచ ప్రసిద్ధ 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్', 'స్టార్ ట్రెక్' సినిమాల స్పూర్తితో ఈ భాషకు ఒక పూర్తి స్థాయి రూపాన్ని ఇచ్చారు.

ఆస్ట్రేలియాలో పడిన బీజం:

కంప్యూటర్ సైన్స్ చదివిన మదన్ కార్కీ ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు పిల్లలకు పాఠాలు చెప్తూ సరదాగా 'క్లిక్' అనే 100 పదాల చిన్న భాషను తయారు చేశారు. మిన్ అంటే నేను, నిమ్ అంటే మీరు అని ప్రాథమిక పదాలు రాశారు. ఇక ఆ చిన్న ఆలోచననే బాహుబలి కోసం విస్తరించి, వందల పదాలు, వ్యాకరణంతో పూర్తి స్థాయి 'కిలికి' భాషగా మార్చేశారు.

కేవలం సినిమా కోసం ఒక భాషనే సృష్టించి, దానికి వ్యాకరణం కూడా రాయడం అంటే మామూలు విషయం కాదు. ఇక మదన్ కార్కీ సృజనాత్మకత, రాజమౌళి విజన్ కలగలసి ఈ ‘కిలికి’ భాషను బాహుబలి చిత్రంలోనే అత్యంత ఆసక్తికరమైన అంశంగా నిలిపాయి. సినిమా చరిత్రలోనే ఇది ఒక సరికొత్త ప్రయోగంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News