మహేష్ ఇంతకీ కృష్ణుడా? రాముడా? డౌట్ పెట్టేసిన రాజమౌళి!
ఈ శనివారం సాయంత్రం `వారణాసి` టైటిల్ గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. టైటిల్ గ్లింప్స్ రాజమౌళి అసాధారణ సాహసాన్ని, గొప్ప విజన్ ని ఆవిష్కరించింది.;
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు దశాబ్ధాలు పైగా టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా హోదాను కొనసాగిస్తున్నారు. అతడు మొదటిసారి 'వారణాసి' చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్‌ను పెద్ద స్థాయిలో టచ్ చేయబోతున్నాడు. ప్రపంచ దేశాలలో ఈ సినిమాని మార్కెట్ చేసేందుకు ఎస్.ఎస్.రాజమౌళి అద్భుతమైన ప్రణాళిక, వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. ప్రచార దశ నుంచే అతడు పకడ్భంధీగా ఆలోచిస్తున్నాడు.
ఫిలింనగర్ గుసగుస:
ఈ శనివారం సాయంత్రం `వారణాసి` టైటిల్ గ్రాండ్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. టైటిల్ గ్లింప్స్ రాజమౌళి అసాధారణ సాహసాన్ని, గొప్ప విజన్ ని ఆవిష్కరించింది. ఈసారి అతడు ఎంచుకున్న కాన్సెప్ట్ ఒక మార్వల్ సినిమాకి, డీసీ సినిమాకి ఏమాత్రం తగ్గదని ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ మహేష్ గురించి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఒక డౌట్ రైజ్ చేయడం ఇప్పుడు ఫిలింనగర్ లో గుసగుసలకు తావిచ్చింది. మహేష్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. అతడిలో కృష్ణుడు ఉన్నప్పుడు నేను శ్రీరాముడిగా చూపించాలంటే చాలా ఆలోచించానని అన్నారు. ఫోటోషూట్ తర్వాత మాత్రమే తనకు నమ్మకం పెరిగిందని అన్నారు.
నెటిజనుల్లో డిబేట్:
మహేష్‌ని రాముడి వేషం వేయించి ఫోటోషూట్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి అని జక్కన్న అన్నాడు. అతడిని అలా చూసి నాలో నేనే సగం డైలమాలో ఉన్నాను. మహేష్ కొంటెగా ఉంటాడు గనుక కృష్ణుడిలా ఉండాలనుకున్నాను.. రాముడి పాత్రకు సరిపోతాడా? అని ఆలోచిస్తూనే ఫోటోషూట్ చేసాము... అని చెప్పాడు.
అయితే రాజమౌళి వ్యాఖ్యలు నెటిజనంలోకి మరోలా వెళ్లాయి. ఇది ఇప్పుడు ఆన్ లైన్ లో పెద్ద డిబేట్ కి దారి తీసింది.
అనవసర డౌట్ పెట్టేసాడు:
నిజానికి మహేష్ లోని శ్రీరాముడిని కృష్ణుడు డామినేట్ చేసాడని రాజమౌళి చెప్పారు. వాస్తవంలో మహేష్ కన్నయ్య వేషాలు వేస్తాడా? అతడు గోపీలోలుడేమీ కాదు కదా? .. అభిమానుల్లో ఇలాంటి కొత్త సందేహాలు.. ఎప్పుడూ ఫ్యామిలీమ్యాన్ గా, అంతరపరివర్తనుడిగా, సిగ్గరిగా మాత్రమే అందరి దృష్టిలో ఉన్నాడు. బాలీవుడ్ హీరోల్లా రెండు మూడు ఫ్యామిలీలు అతడికి లేవు. కనీసం ఫలానా హీరోయిన్‌తో ఎఫైర్ ఉంది! అనే ప్రచారం కూడా లేదు. కానీ రాజమౌళి అనవసరంగా లేనిపోని డౌట్లు రాజేసాడు. ఇంతకీ మహేష్ కృష్ణుడా? రాముడా? అన్నది తేలాల్సి ఉంది. దీనిపై మహేష్ స్పందన ఏమిటో చూడాలి.
శ్రీరాముడి పాత్ర కోసం 60రోజులు
వారణాసిలో మహేష్ రుద్రుడిగా, శ్రీరాముడిగా విభిన్న వేషధారణలతో సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. ఇక శ్రీరాముడి వేషధారణలో కీలక ఎపిసోడ్ కోసం 60 రోజులు షూట్ చేసామని రాజమౌళి చెప్పారు. ఇటీవలే చిత్రీరణను పూర్తి చేసారు. ఆ ఎపిసోడ్ లో ప్రతి సబ్ ఎపిసోడ్ ఒక సినిమాలాగా ఉంటుందని అన్నారు. ఈ ఎపిసోడ్ మహేష్ సినిమాల్లోనే మెమరబుల్ గా ఉంటుందని రాజమౌళి అన్నారు.