ఇన్నేళ్లైనా సేమ్ బ్యూటీ.. సేమ్ గ్రేస్
ఎస్.ఎస్ రాజమౌళి, జెనీలియా దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కలుససుకున్నారు. వారిద్దరి కలయికకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.;
ఎస్.ఎస్ రాజమౌళి, జెనీలియా దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కలుససుకున్నారు. వారిద్దరి కలయికకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో జెనీలియా, రాజమౌళి ఇద్దరూ ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్న తీరు వారి మధ్య అనుబంధాన్ని సూచిస్తోంది. కాగా, రాజమౌళి, జెనీలియా కలిసి గతంలో సై అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.
అయితే వీరిద్దరి రీయూనియన్ ఇప్పుడు చాలా మందిని స్పెషల్ గా ఆకట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సై సినిమా ఇద్దరికీ చాలా ప్రత్యేకమైన సినిమా. తెలుగు సినిమాకు రగ్బీ అనే గేమ్ ను పరిచయం చేయడమే కాకుండా ఆ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా కొత్తదనాన్ని ఇచ్చింది. సై సినిమా టైమ్ కు అటు జెనీలియా, ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు.
సై సినిమా సక్సెస్ వారిద్దరి కెరీర్లలో మంచి మైల్ స్టోన్ ఫిల్మ్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ వారిద్దరూ కలిసి పని చేసింది లేదు. జెనీలియా అయితే తెలుగులో సినిమా చేసి 13 ఏళ్లవుతుంది. ఇప్పుడు మళ్లీ జూనియర్ సినిమాతో జెనీలియా టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. జూనియర్ మూవీ జులై 18న రిలీజ్ కానుండగా ఆ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రాజమౌళి హాజరయ్యారు.
జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రాజమౌళి, జెనీలియా రీ యూనియన్ జరిగింది. ఈ ఈవెంట్ లో భాగంగా రాజమౌళి జెనీలియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇన్నేళ్లైనా జెనీలియా అలానే ఉందని, సేమ్ బ్యూటీ, సేమ్ గ్రేస్ అని అన్నారు. ఈ సినిమాలో కొత్త జెనీలియాను చూస్తారని డీఓపీ సెంథిల్ ప్రామిస్ చేశారని, జూనియర్ లో జెనీలియా ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని రాజమౌళి అనగా ఇప్పుడా కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.