వారణాసికి ఇక ఎనిమిది నెలలు మాత్రమే మిగిలున్నాయి..!
అసలు విషయానికి వస్తే.. హాలీవుడ్ విజువల్ వండర్ అయిన అవతార్ సిరీస్ మూడో భాగం Avatar: Fire and Ash డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది.;
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ప్రస్తుతం తన కొత్త సినిమా వారణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను.. రాజమౌళి స్వయంగా వెల్లడించారు. ఈ అప్‌డేట్ హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో జరిగిన.. ప్రత్యేక సంభాషణలో బయటకు రావడం విశేషం.
రాజమౌళి మాట్లాడుతూ, "మేము ఇప్పటికే ఈ సినిమా సంవత్సరం రోజుల షూటింగ్ ముగించాము. అయితే ఈ సినిమాను పూర్తి చేయడానికి ఇంకా 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది" అని స్పష్టంగా చెప్పారు. ఈ మాటలతో మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. రాజమౌళి సినిమాలు అంటేనే టైమ్ తీసుకుని.. ప్రతి సీన్‌ను పర్ఫెక్ట్‌గా రూపొందిస్తారు అనే విషయం తెలిసిందే. అలాంటిది ఈ సినిమా ఎంత పర్ఫెక్ట్‌గా.. తీయబోతారు అని అందరూ ఎదురుచూస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. హాలీవుడ్ విజువల్ వండర్ అయిన అవతార్ సిరీస్ మూడో భాగం Avatar: Fire and Ash డిసెంబర్ 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా అవతార్ టీమ్ భారత్‌లో ప్రత్యేక ప్రమోషన్స్ నిర్వహించింది. ఆ క్రమంలో రాజమౌళి సహా కొంతమంది ప్రముఖ దర్శకులకు ‘అవతార్ 3’ను.. ముందుగానే చూపించారు.
ఆ తర్వాత జేమ్స్ కామెరూన్.. రాజమౌళితో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈ సంభాషణలో సినిమా మేకింగ్, కథ చెప్పే విధానం, విజువల్స్ గురించి ఇద్దరూ పరస్పరం చర్చించుకున్నారు. అవతార్ సినిమా చూసిన అనుభవాన్ని రాజమౌళి.. షేర్ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, "అవతార్: ఫైర్ అండ్ యాష్‌ను అందరికంటే ముందుగా చూడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజువల్స్, సీక్వెన్స్‌లు, పాత్రలను తీర్చిదిద్దిన తీరు అద్భుతం. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో చిన్న పిల్లాడిలా ఫీలయ్యాను" అని చెప్పారు.
ఇక ఈ సంభాషణలోనే జేమ్స్ కామెరూన్ ‘వారణాసి’ సినిమా గురించి ఎన్నో విశేషాలు అడిగారు. షూటింగ్ పరిస్థితి ఏంటి అని తెలుసుకున్నారు. అప్పుడే రాజమౌళి ప్రస్తుత షూటింగ్ అప్‌డేట్‌ను వివరించారు. అంతేకాదు.. వారణాసి సెట్స్‌కు వచ్చి షూటింగ్ చూడవచ్చా? అని కామెరూన్ అడగడం మరో హైలైట్‌గా మారింది.
ఆ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. "మీరు రావడం మా టీమ్‌కు మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమా ఇండస్ట్రీకి గర్వకారణం అవుతుంది" అని చెప్పారు. దీనిపై కామెరూన్ సరదాగా "పులులతో షూటింగ్ ప్లాన్ చేస్తే చెప్పండి. నేను వచ్చి షూట్ చేస్తాను" అని నవ్వుతూ కామెంట్ చేశారు.