• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి - బన్నీ కాంబో...

రాజమౌళి - బన్నీ కాంబో ఎందుకు సెట్టవ్వలేదు?

| ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ఇండియాలోనే నెంబర్ డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2024-09-20 03:43 GMT

‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో ఇండియాలోనే నెంబర్ డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా చూడని దర్శకుడిగా మరో అరుదైన ఘనత కూడా రాజమౌళి దక్కించుకున్నారు. ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పాలి. సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతూ ఉంది. ఎవ్వరు అందుకోలేని హైట్స్ కి రాజమౌళి ఇప్పటికే చేరిపోయారు.

నెక్స్ట్ హాలీవుడ్ లెవల్ లో ఒక ఇండియన్ దర్శకుడిగా సక్సెస్ కొట్టడమే రాజమౌళి టార్గెట్ గా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి మూవీ ప్లాన్ చేశాడు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథని రాజమౌళి చెప్పబోతున్నారు. వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు పాత్ర ఈ సినిమాలో ఉండబోతోంది. ఇదిలా ఉంటే రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్(3), రామ్ చరణ్ (2), ప్రభాస్(3) తో సినిమాలు చేశాడు.

అలాగే రవితేజ, నాని, నితిన్, సునీల్ లతో ఒక్కో మూవీ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. వారిద్దరూ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా ఎప్పుడు రాలేదు. దీంతో బన్నీతో జక్కన్న మూవీ చేసే ప్రయత్నం చేయలేదా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ‘మగధీర’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు.

అంత పెద్ద హిట్ తర్వాత అరవింద్ రాజమౌళి దర్శకత్వంలో అల్లు అర్జున్ తో మూవీ ప్లాన్ చేయకుండా ఉంటాడా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తోంది. నిజానికి రాజమౌళి బన్నీతో మూవీ చేయాలని ప్లాన్ చేసాడని టాక్. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత బన్నీతోనే మూవీ చేయాలని రాజమౌళి అనుకున్నారంట. అయితే ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు. తరువాత అజిత్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రం చేయాలని ఆలోచించారంట.

ఇది కూడా కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది. ఆ ఆలోచన స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్ సినిమాని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా తరువాత రాజమౌళి చేశారని ఇండస్ట్రీలో టాక్. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాని జక్కన్న ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి మూడేళ్లు సమయం పట్టొచ్చు. ఈ లోపు అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’ తర్వాత అట్లీ, సందీప్ రెడ్డి వంగా సినిమాలు కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవి అయ్యాక రాజమౌళి బన్నీ కాంబినేషన్ లో సినిమా ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Tags:    
  • Rajamouli 
  • Alluarjun 
  • Iconstar 
  • Tollywood 
  • SSMB29 
  • Maheshbabu 
  • Bahubalifilm 
  • Pushpa2 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS