రాజా సాబ్ లేట్ అందుకేనా? జక్కన్న కూడా జాగ్రత్తపడ్డారా?
2025 ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజా సాబ్. టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
ఇటీవల రాజా సాబ్ మేకర్స్ విడుదల చేసిన టీజర్ లో హరర్ అంశాలతో పాటు ప్రభాస్ పండించిన కామెడీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూనే వచ్చింది.
2025 ఏప్రిల్ 10వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని మేకర్స్ ముందు అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత వాయిదా వేస్తూ వచ్చారు. అనేక వాయిదాల తర్వాత ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే సినిమా ఆలస్యం వెనుక ప్రొడక్షన్, ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణమని అంతా భావించారు.
కానీ అది నిజం కాదని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్- VFX విభాగంలోని ప్రధాన సమస్యల వల్ల సినిమా లేట్ అయింది. ఇటీవల నిర్మాత విశ్వప్రసాద్ ఆ విషయాన్ని తెలిపారు. రాజా సాబ్ కు వర్క్ చేస్తున్న ఓ సీనియర్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్.. నెలల తరబడి వర్క్ చేశారని తెలిపారు. ఒక్క వీఎఫ్ఎక్స్ షాట్ కూడా ఇవ్వలేదని చెప్పారు.
సినిమాకు సదరు టెక్నీషియన్ తో పనిచేయడం కష్టమైందని చెప్పిన విశ్వ ప్రసాద్.. వీఎఫ్ ఎక్స్ షాట్ కోసం ప్రెజర్ చేయగా తప్పుకుంటానని అనేవారని పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్టు నుంచి తప్పించేందుకు నిర్ణయించామని కూడా చెప్పారు. అందుకే సినిమా లేట్ అయినట్లు పరోక్షంగా విశ్వప్రసాద్ తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అయితే సదరు టెక్నీషియన్ ను దర్శకధీరుడు రాజమౌళి కూడా మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు గాను బోర్డులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కానీ కొన్ని కారణాల వల్ల జక్కన్న కూడా ఆయనను తప్పించారని సమాచారం. మొత్తానికి రాజా సాబ్ తో పాటు SSMB 29 మేకర్స్ ఆ టెక్నీషియన్ ను తప్పించారు. ఏదేమైనా రాజా సాబ్ ఆలస్యానికి కారణం ఆయనేనని తెలుస్తోంది.