'యూనివర్స్ లో మనమెక్కడో'.. రాజ్ నిడిమోరు మాజీ భార్య ఇలా..

అదే సమయంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి సోషల్ మీడియా పోస్ట్‌.. ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.;

Update: 2025-12-02 12:55 GMT

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు రీసెంట్ గా హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నో రోజులుగా అనేక రూమర్లు వస్తున్నా రెస్పాండ్ అవ్వని వారిద్దరూ.. వివాహ బంధంతో మంగళవారం ఉదయం ఒకటయ్యారు. భూత శుద్ధి సంప్రదాయంలో రాజ్ నిడిమోరు, సామ్.. పెళ్లి చేసుకుని ప్రత్యేకంగా నిలిచారు.

తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి ఆలయంలో వివాహం జరగ్గా.. అందుకు సంబంధించిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి. సమంత- రాజ్ నిడిమోరు పెళ్లి బంధుమిత్రుల సమక్షంలో పూర్తిగా ప్రైవేట్‌ గా జరగ్గా.. కంగ్రాట్యులేషన్స్ చెబుతున్న పోస్టులు మాత్రం నెట్టింట ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

అదే సమయంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి సోషల్ మీడియా పోస్ట్‌.. ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ వార్తల్లో ఉండే ఆమె.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్ తో హాట్ టాపిక్ గా మారారు. అందులో మన యూనివర్స్ ను పిక్ ను పోస్ట్ చేశారు. ఎలాంటి క్యాప్షన్ కూడా ఇవ్వలేదు.

కానీ యూనివర్స్ మధ్యలో.. 'మనం ఇక్కడ ఉన్నాం' అని ఇంగ్లీష్ లో రైటప్ ఇచ్చారు. దీంతో శ్యామాలి పోస్ట్ చేసిన ఫోటో తెగ చక్కర్లు కొడుతుండగా అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. శ్యామాలి అభిప్రాయం ఇదేనేమోనని చెప్పుకుంటూ పోతున్నారు.

అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నామని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారని కొందరు నెటిజన్లు చెబుతుండగా.. మరికొందరు మాత్రం ఇంత మంది మధ్యలో.. ఇంత మంది విశ్వంలో మనం ఉన్నామని ఉద్దేశంలో పెట్టారని అంటున్నారు. ఇంకొందరు మాత్రం.. తనకు చాలా మంది తోడు ఉన్నారని, వచ్చే సమస్యలు కూడా దీని ముందు ఎంత? అన్నట్లు ఆమె ఒక హింట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ విశ్వంలో మనమంతా చిన్న భాగం మాత్రమేనని శ్యామాలి ఉద్దేశమని అంటుండగా.. ఎవరు ఏం చేసినా భయపడేది లేదనేది ఆమె అభిప్రాయం అని చెబుతున్నారు. నిజానికి.. సామ్, రాజ్ మధ్య డేటింగ్ రూమర్స్ మొదలైనప్పటి నుంచి.. శ్యామాలి పోస్టులు పెట్టడమే లేటు.. క్షణాల్లో వైరల్ అయ్యేవి. తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారని, రుణం ఉన్నంత వరకే బంధాలు అన్నీ మనతో ఉంటాయని నిన్న పోస్ట్ చేశారు శ్యామాలి.

Tags:    

Similar News