• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ "23" ట్రైలర్.....

రాజ్ "23" ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేలా..

| మల్లేశం, 8 A.M మెట్రో చిత్రాలతో డైరెక్టర్ రాజ్ ఆర్.. ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-06 16:41 GMT

మల్లేశం, 8 A.M మెట్రో చిత్రాలతో డైరెక్టర్ రాజ్ ఆర్.. ఆడియన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. తన టాలెంట్ తో సినీ ప్రియులను మెప్పించారు. ఇప్పుడు నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన తెరకెక్కించిన మూవీ '23'.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది.

రాజ్ ఆర్ రూపొందించిన ఆ సినిమాను టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నేతృత్వంలోని స్పిరిట్ మీడియా సమర్పించగా.. స్టూడియో 99 గ్రాండ్ గా నిర్మించింది. తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించగా.. ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ వంటి పలువురు నటీనటులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ.. మే 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో మేకర్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అదే జోష్ తో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే మూడు నిజజీవిత విషాద ఘటనలతో కూడిన కథతో సినిమా రూపొందినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. 1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరి పేట బస్సు అగ్నిప్రమాదం, 1997 జూబ్లీహిల్స్ కారు బాంబు దాడి ఘటనల ఆధారంగా సినిమా ఉండనున్నట్లు స్ఫష్టమవుతోంది.

కేవలం ఘటనలనే చూపించడం కాకుండా, వాటి వెనుక ఉన్న ఆందోళన, హింసకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాను రాజ్ ఆర్ తీసినట్లు తెలుస్తోంది. సినిమాలో కథను వివరించడంలో తన మార్క్ ను క్లియర్ గా చూపిస్తారని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మూవీలో ప్రతి రోల్ కు తగిన ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది.

ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. నిజజీవిత ఘటనలను నెరేట్ చేస్తూ వచ్చిన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లవ్ ట్రాక్ నేచురల్ గా ఉండి ఆకట్టుకుంటోంది. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, మార్క్ కె రాబిన్ ఇంటెన్స్ మ్యూజిక్ ట్రైలర్ కు మెయిన్ అసెట్స్ గా నిలిచాయి. మరి మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    
  • 23TeluguTrailer 
  • RajRachakonda 
  • Jhansi 
  • Teja 
  • Tanmai 
  • SpiritMedia 
  • 23Movie 
  • RanaDaggubati 
  • SunnyKurapati 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS