'బంగారం' లాంటి సమంత వెంట రాజ్ ఉంటే చాలు.. మరో బంపర్ హిట్ ఆన్ ది వే!

భారతీయ డిజిటల్ స్క్రీన్‌లపై సరికొత్త సంచలనాలకు తెరలేపిన కాంబినేషన్లలో సమంత - రాజ్ నిడిమోరుల జోడీ అత్యంత ప్రత్యేకమైనది.

Update: 2026-05-26 04:51 GMT

భారతీయ డిజిటల్ స్క్రీన్‌లపై సరికొత్త సంచలనాలకు తెరలేపిన కాంబినేషన్లలో సమంత - రాజ్ నిడిమోరుల జోడీ అత్యంత ప్రత్యేకమైనది. వీరి మధ్య పరిచయం.. ప్రయాణం `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్‌తో ఘనంగా ప్రారంభమైంది. ఆ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే ఈ ఇద్ద‌రి నిజ జీవితాల్లో మిరాకిల్స్ మొద‌ల‌య్యాయంటూ చ‌ర్చ న‌డిచింది. ఆ తర్వాత ఫర్జీ, సిటాడెల్: హనీ బన్నీ వంటి భారీ ప్రాజెక్టుల కోసం ఈ ఇద్దరూ కలిసి పనిచేశారు. కాలక్రమేణా వీరి వృత్తిగత బంధం వ్యక్తిగత బంధంగా మారి, ఇటీవల పెళ్లితో ఈ క్రేజీ జంట ఒకటయ్యారు.

సమంత సినీ కెరీర్‌ను గమనిస్తే.. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌. రాజీ అనే పవర్‌ఫుల్ పాత్రతో సమంతను సరికొత్తగా ఆవిష్కరించిన ఘనత రాజ్ నిడిమోరు - డికె జోడీకే దక్కుతుంది. ఆ సిరీస్ తర్వాత రాజ్ నిడిమోరు ప్రతి విషయంలోనూ సమంతను వెంట ఉండి నడిపించారు. మ‌యోసైటిస్ నుంచి కోలుకున్న త‌ర్వాత సామ్ సినిమాలు సిరీస్ ల‌తో బిజీ అయ్యారు. త‌ను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ.. సాధించిన ప్రతి విజయంలోనూ ఆయన కీలక భాగస్వామిగా నిలిచారు. సమంతలోని వైవిధ్యమైన నటనను రకరకాల పాత్రల ద్వారా బయటకు తీస్తూ.. త‌న స్టార్ డ‌మ్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రాజ్ నిడిమోరు సపోర్ట్ ఎంతో అండగా నిలిచింది.

ప్రస్తుతం ఈ హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న సరికొత్త చిత్రం `మా ఇంటి బంగారం`. విశేషం ఏంటంటే ఈ సినిమాతో సమంత స్వయంగా నిర్మాతగా మారుతుండగా రాజ్ నిడిమోరు దీనికి అద్భుతమైన స్క్రిప్టును అందించారు. ఒక పక్కా ఫ్యామిలీ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ఒక `మహిళా శివంగి` లాంటి పవర్‌ఫుల్ పాత్రను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఒక సాధారణ అమ్మాయి, బంగారం లాంటి కోడలి కథలో ఊహించని అద్భుతమైన ట్విస్టులతో ఈ సినిమా కథాంశం సాగనుంది. ఈ ప్రాజెక్ట్ సమంత కెరీర్‌లోనే బెస్ట్ గా నిల‌వనుంద‌ని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చెబుతోంది.

ఇటీవలే విడుదలైన `మా ఇంటి బంగారం` అఫీషియల్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. ఇందులో అమాయకంగా కనిపిస్తూ.. సరిగ్గా నోరు తిరగనట్టు మాట్లాడే ఒక సాధారణ గృహిణి పాత్రలో సమంత కనిపిస్తూనే.. మరోవైపు శత్రువుల గుండెల్లో దడ పుట్టించే రేంజ్‌లో సీరియస్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టేసింది. గ్రిప్పింగ్ స్టోరీ- ఆసక్తికరమైన నేరేషన్‌తో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను రక్తి కట్టించనుందని ట్రైలర్ లోని విజువల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. సమంత కెరీర్‌లో మరో మైలురాయి లాంటి బ్లాక్ బస్టర్ ఖాయమనే భరోసాని ఈ గ్లింప్స్ ఇచ్చింది.

మొత్తంగా చూస్తే.. సమంత నటనకు తోడు తెర వెనుక రాజ్ నిడిమోరు మ్యాజిక్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్లుగా మారబోతున్నాయి. రాజ్ నిడిమోరు అందించిన సహకారం, క్రియేటివ్ సపోర్ట్ సమంతకు ఈ హోమ్ ప్రొడక్షన్‌లో కొండంత అండగా నిలిచింది. థియేటర్లలో కూడా రాజ్ నిడిమోరు బ్రాండ్ మేకింగ్.. సమంత సోలో పెర్ఫామెన్స్ క‌చ్చితంగా వర్కవుట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా అంచనా వేస్తున్నాయి. సమంత వెంట రాజ్ ఉంటే చాలు.. అది బంపర్ హిట్టే అనే సెంటిమెంట్‌ను ఈ చిత్రం మరోసారి నిజం చేయనుందని అభిమానులు నమ్ముతున్నారు.


Full View


Tags:    

Similar News