60 కోట్ల స్కామ్.. నేరం ఒప్పుకున్న రాజ్ కుంద్రా.. 5గంటల పాటు విచారణ !

ప్రముఖ బాలీవుడ్ జంట శిల్పా శెట్టి -రాజ్ కుంద్రా దంపతులు గత రెండు నెలలుగా రూ.60కోట్ల స్కామ్ విషయంలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-09-16 07:03 GMT

ప్రముఖ బాలీవుడ్ జంట శిల్పా శెట్టి -రాజ్ కుంద్రా దంపతులు గత రెండు నెలలుగా రూ.60కోట్ల స్కామ్ విషయంలో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెట్టుబడి పేరిట తనను భారీగా మోసం చేశారు అంటే ఒక వ్యాపారవేత్త వీరిపై కేసు ఫైల్ చేయించారు. అయితే ఇప్పుడు ఈ కేస్ విచారణకు రాగా.. 5 గంటల పాటు విచారణ నిర్వహించడంతో రాజ్ కుంద్రా నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు చూద్దాం.

రాజ్ కుంద్రాను 5 గంటల పాటు విచారించిన పోలీసులు..

ఒక వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరా మోసం చేసిన కేసులో నటి శిల్పా శెట్టి దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు రాజకుంద్రాను ముంబై పోలీసులు విచారించారు. దాదాపు 5 గంటలపాటు ఆయనని విచారించిన పోలీసులు.. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలతో పాటు ఇతర ఖర్చుల గురించి కూడా ఆరాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని కంపెనీలలో రూ.60 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్లు విచారణ సమయంలో రాజ్ కుంద్రా అంగీకరించినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిధులను నిజంగానే సంబంధిత కంపెనీలకు మళ్ళించారా? లేక ఇతర వ్యక్తిగత ఖర్చులకోసం ఉపయోగించారా ? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

రాజ్ కుంద్రా ఇతర వ్యాపారాలపై పోలీసులు నిఘా..

అందులో భాగంగానే రాజ్ కుంద్రా ఇతర వ్యాపారాలపై అలాగే ఆయన అద్దెకు తీసుకున్న కార్యాలయాలకు సంబంధించిన చెల్లింపులపై కూడా పోలీసులు నిఘా పెట్టి ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిలిమ్స్ కు రాజ్ చెల్లింపులు చేశారని.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని.. ఆర్థిక నేరాల విభాగం కూడా ఇప్పుడు ఆయనను కోరింది. మొత్తానికైతే రూ.60 కోట్ల స్కామ్ నిజమేనని బయటపడడంతో మరి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

అసలేం జరిగిందంటే?

ముంబైకి చెందిన వ్యాపారవేత్త , లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. శిల్పా - రాజ్ కుంద్రా దంపతులపై ఆరోపణలు చేశారు. 2015 - 2023 మధ్యకాలంలో శిల్పా శెట్టి దంపతులు రూ.60 కోట్ల మేరా తనను మోసం చేశారని ఆరోపిస్తూ.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. తమ వ్యాపార సంస్థలను విస్తరించడానికి ఆ డబ్బును తాను పెట్టుబడిగా పెట్టానని.. కానీ ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేశారు అని దీపక్ తెలిపారు.

అందులో భాగంగానే.. మొదట రూ.75 కోట్లు 12 శాతం వడ్డీతో కావాలని కోరారు. కానీ పన్నుల భారం నుంచి తప్పించుకోవడానికి రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని నన్ను ఒప్పించారు. అయితే నెలవారీ రాబడి ఇవ్వకపోగా అసలు కూడా తిరిగి ఇవ్వలేదు. వీరిని నమ్మి 2015 ఏప్రిల్ లో రూ.31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్ లో రూ.28.53 కోట్లు బదిలీ చేశాను అని దీపక్ కొఠారి ఎఫ్ఐఆర్లో తెలిపారు. అంతేకాదు ఈ కేసులో ఇరుక్కున్న ఈ జంటకు పోలీసులు లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా 5 గంటలు విచారించినట్లు సమాచారం.

Tags:    

Similar News