• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ మూవీ మా ఆయన కోసం...

ఈ మూవీ మా ఆయన కోసం చూడండి- రహస్య గోరక్

| కిరణ్ అబ్బవరం హీరోగా డిఫరెంట్ కంటెంట్ తో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ‘క’.

By - Tupaki Desk
Update: 2024-10-30 04:16 GMT

కిరణ్ అబ్బవరం హీరోగా డిఫరెంట్ కంటెంట్ తో అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చిత్రం ‘క’. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఈ సినిమాను రెడీ ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. మారుమూల విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. పోస్ట్ మెన్ క్యారెక్టర్ లో కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు.

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాటిక్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేసినట్లు అర్థమవుతుంది. కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే హైయెస్ట్ బజ్ తో ఈ చిత్రం థియేటర్స్ లో వస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోయే ఈ సినిమాపై బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. తాజాగా ‘క’ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమాని ఎందుకు చూడాలనే దానికి మూడు కారణాలు చెబుతాను. ఒకటి మీకోసం చూడండి… ఇందులో మీకు కావలసిన వినోదం ఉంటుంది. కొత్త ప్రపంచం కనిపిస్తుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కచ్చితంగా మీరు పెట్టి రూపాయికి వాల్యూ ఉంటుంది. ఇంకోటి మా కోసం చూడండి. ఇష్టంతో చేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతుందని అంటారు. ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా ఇష్టంతో కష్టపడి పనిచేశారు. ఒక లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు, అలాగే హీరో, హీరోయిన్స్ అందరూ చాలా ఇష్టపడి ఈ మూవీకి వర్క్ చేశారు.

మా ఆయన కోసం ఈ మూవీ చూడండి. ఈ చిత్రం కోసం కిరణ్ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అర్ధరాత్రి వేళల్లో కూడా ఫోన్ చేసి ఈ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంటే బాగుంటాయి అనేది డిస్కస్ చేసేవారు. అతని మనసుకి చాలా దగ్గరైనా కథ. అందుకే ఈ సినిమా సక్సెస్ అయితే ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. కచ్చితంగా మిమ్మల్ని అలరించేందుకు కృషి చేస్తామని రహస్య గోరక్ చెప్పుకొచ్చింది. ఈమె స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రహస్య గోరక్ కిరణ్ అబ్బవరంతో రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ మూవీ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. కిరణ్ అబ్బవరంతో పెళ్లి తర్వాత మరల ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛమైన తెలుగులో స్పీచ్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది.

Tags:    
  • Rahasyagorak 
  • KA 
  • Kiranabbavaram 
  • Tollywood 
  • Filmindustry 
  • Kaprereleaseevent 
  • Nagachaitanya 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS